
గాయంతో ఔట్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్‌తో జరగిన తొలి టెస్టు మ్యాచ్‌లో మార్క్ వుడ్ మోచేతికి గాయమైంది. దీంతో అతను రెండో టెస్టు మ్యాచ్ ఆడడం లేదు. తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలడంతో కొంతకాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ సారి ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. కాగా మెగా వేలంలో మార్క్ వుడ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 7 కోట్ల 50 లక్షల రూపాయల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. 140 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో బంతులు విసిరే మార్క్ వుడ్ అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ రాణించగలడు. కెరీర్లో ఇప్పటివరకు ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడిన వుడ్.. ఈ సీజన్‌కు కూడా దూరం కాబోతుండడం గమనార్హం. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న మార్క్ వుడ్ దూరం కావడం లక్నోకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. కాగా మార్క్ వుడ్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఎవరిని జట్టులో చేర్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మూడో ఇంగ్లండ్ ప్లేయర్
ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్న మూడో ఇంగ్లండ్ ప్లేయర్‌గా మార్క్‌వుడ్ నిలిచాడు. మార్క్‌వుడ్ కంటే ముందే గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన జేసన్ రాయ్, కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన ఆలెక్స్ హేల్స్ బయోబబుల్‌లో ఉండలేమంటూ ఐపీఎల్ 2022 నుంచి పూర్తిగా తప్పుకున్నారు. దీంతో జేసన్ రాయ్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఆఫ్ఘానిస్థాన్ యంగ్ బ్యాటర్ రెహ్మనుల్లా గుర్భాజ్‌ను జట్టులోకి తీసుకుంది. ఆలెక్స్ హేల్స్ స్థానంలో కోల్‌కతానైట్ రైడర్స్ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను జట్టులోకి తీసుకుంది.

లక్నో షెడ్యూల్
కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ ఈ నెల 28న తన ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. 31న చెన్నై సూపర్ కింగ్స్‌తో, ఏప్రిల్ 4న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, 10న రాజస్థాన్ రాయల్స్‌తో, 16న ముంబై ఇండియన్స్‌తో, 19న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో, 24న ముంబై ఇండియన్స్‌తో, 29న పంజాబ్ కింగ్స్‌తో, మే 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, 7న కోల్‌కతానైట్ రైడర్స్‌తో, 10న గుజరాత్ టైటాన్స్‌తో, 15న రాజస్థాన్ రాయల్స్‌తో, ఇక 18న చివరి మ్యాచ్‌లో కోల్‌కతానైట్ రైడర్స్‌తో తలపడనుంది.

లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి జట్టు
కేఎల్ రాహుల్ (17 కోట్లు), మార్కస్ స్టొయినిస్ (9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), అవేశ్ ఖాన్ (10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య (8.25 కోట్లు), మార్క్ వుడ్ (7.50 కోట్లు), క్వింటన్ డికాక్ ( 6.75 కోట్లు), దీపక్ హుడా (5.75 కోట్లు), మనీశ్ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్ మయేర్స్ (50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్( వీరందరికీ 20 లక్షలు).


Click it and Unblock the Notifications












