
ఐపీఎల్ ప్రారంభానికి మరో 3 రోజులు మాత్రమే ఉండడంతో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తమ జెర్సీతోపాటు థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది. జెర్సీని, థీమ్ సాంగ్‌ను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అభిమానులతో పంచుకుంది. 2 నిముషాల 32 సెకన్ల నిడివి గల ఈ వీడియో సాంగ్‌ను అభిమానులు షేర్లు చేస్తున్నారు.
'అబ్ అప్నీ బారీ హై' అంటూ సాగే ఈ వీడియో సాంగ్‌ను ప్రముఖ రాపర్ బాద్షా ఆలపించడంతోపాటు వీడియోలోనూ కనిపించారు. ఇక ఈ వీడియోలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను చూపించారు. అలాగే ఈ సాంగ్‌లో గల్లీలో చిన్నపిల్లలు ఆడే క్రికెట్‌ను చూపించారు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ జెండాలు ఎక్కువగా కనిపించాయి. ప్రస్తుతం లక్నోసూపర్ జెయింట్స్ జట్టు థీమ్ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక థీమ్ సాంగ్‌తోపాటు విడుదల చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జెర్సీ కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది.
లక్నో సూపర్ జెయింట్స్ పూర్తి జట్టు
కేఎల్ రాహుల్ (17 కోట్లు), మార్కస్ స్టొయినిస్ (9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), అవేశ్ ఖాన్ (10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య (8.25 కోట్లు), మార్క్ వుడ్ (7.50 కోట్లు), క్వింటన్ డికాక్ ( 6.75 కోట్లు), దీపక్ హుడా (5.75 కోట్లు), మనీశ్ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్ మయేర్స్ (50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్ ( వీరందరికీ 20 లక్షలు).