Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KL Rahul: గెల‌వాలంటే మిడిలార్డ‌ర్ బ‌లంగా ఉండాలి.. కెప్టెన్‌గా నేను నేర్చుకున్న‌ది ఏమిటంటే..

IPL 2022: Lucknow Super Giants captain KL Rahul says middle order must be strong for team to succeed

ఐపీఎల్‌లో ఒక జ‌ట్టు విజ‌య‌వంతం కావాలంటే మిడిలార్డ‌ర్ స్ట్రాంగ్‌గా ఉండాల‌ని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. మ‌రో 3 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో జ‌ట్టు గురించిన ప‌లు విష‌యాల‌పై రాహుల్ మాట్లాడాడు. కాగా ఐపీఎల్‌లోకి ఈ సారి కొత్తగా ప్ర‌వేశించిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పేప‌ర్‌పై అన్ని విభాగాల్లో బ‌లంగా క‌నిపిస్తోంది. దానికనుగుణంగా మైదానంలోనూ స‌త్తా చాటాలని ఆ టీం ఆట‌గాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.

 అప్పుడే ఓపెన‌ర్లు దూకుడుగా ఆడ‌గ‌ల‌రు

అప్పుడే ఓపెన‌ర్లు దూకుడుగా ఆడ‌గ‌ల‌రు

ఐపీఎల్‌లో ఒక జ‌ట్టు విజ‌య‌వంతంగా కావాలంటే మిడిలార్డ‌ర్‌లో స‌త్తా చాటగ‌ల ఆట‌గాళ్లుండాల‌ని ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. మిడిలార్డ‌ర్ బ‌లంగా ఉంటేనే ఓపెన‌ర్లు దూకుడుగా ఆడి, ప‌వ‌ర్‌ప్లేలో వీలైన‌న్నీ ఎక్కువ‌ ప‌రుగులు చేయ‌గ‌లుగుతార‌ని తెలిపాడు. అలాగ‌ని ఓపెన‌ర్లు ఎప్పుడూ దూకుడుగా ఆడ‌డం స‌రికాద‌ని అన్నాడు. ప‌రిస్థితులను బ‌ట్టి కొన్ని సార్లు నిల‌క‌డ‌గా కూడా ఆడాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నాడు. 130 నుంచి 140 ప‌రుగుల మోస్త‌రు ల‌క్ష్యం ఉన్న‌ప్పుడు కూడా 200 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయ‌డం స‌రికాద‌ని అన్నాడు. కెప్టెన్‌గా తాను నేర్చుకున్న పాఠాల్లో ఇది కూడా ఒక‌ట‌ని రాహుల్ చెప్పాడు

అందుకే వాళ్ల‌ను తీసుకున్నాం

అందుకే వాళ్ల‌ను తీసుకున్నాం

మిడిలార్డ‌ర్‌ను బ‌లంగా ఉంచ‌డం కోస‌మే మార్క‌స్ స్టోయినీస్, జేస‌న్ హోల్డ‌ర్‌, కృనాల్ పాండ్యా, దీప‌క్ హుడా వంటి స్టార్ ఆట‌గాళ్ల‌ను తీసుకున్నామ‌ని రాహుల్ తెలిపాడు. కాగా వీరు నలుగురు హిట్టింగ్‌తో మిడిలార్డ‌ర్‌లో వేగంగా ప‌రుగులు రాబ‌ట్ట‌గ‌ల‌ర‌నే విష‌యం తెలిసిందే. ఇక కెప్టెన్‌గా తానెప్పుడూ జ‌ట్టు విజ‌యం గురించే ఆలోచిస్తాన‌ని రాహుల్ చెప్పాడు. వ్య‌క్తిగ‌త రికార్డుల కంటే జ‌ట్టు ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌న్న రాహుల్‌.. త‌మ ఆట‌గాళ్ల‌ను కూడా ఆ దిశ‌గానే ప్రోత్సాహిస్తాన‌ని వెల్ల‌డించాడు.

రాహుల్ రికార్డులు

రాహుల్ రికార్డులు

ఐపీఎల్‌లో విజ‌య‌వంత‌మైన ఆట‌గాళ్ల‌లో కేఎల్ రాహుల్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. ఈ లీగ్‌లో ప్ర‌స్తుతానికి అత్య‌ధిక ప‌రుగుల‌ స‌గ‌టు క‌ల్గిన బ్యాట‌ర్ రాహులే కావ‌డం గ‌మ‌నార్హం. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 94 మ్యాచ్‌లాడిన రాహుల్ ఏకంగా 47 స‌గ‌టుతో 3273 ప‌రుగులు చేశాడు. ఇందులో 27 హాఫ్ సెంచ‌రీలు, 2 సెంచ‌రీలు ఉన్నాయి.

 లక్నో సూప‌ర్ జెయింట్స్ పూర్తి జ‌ట్టు

లక్నో సూప‌ర్ జెయింట్స్ పూర్తి జ‌ట్టు

కేఎల్‌ రాహుల్ (17 కోట్లు), మార్కస్ స్టొయినిస్ (9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), అవేశ్‌ ఖాన్ (10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య (8.25 కోట్లు), మార్క్‌ వుడ్ (7.50 కోట్లు), క్వింటన్ డికాక్ ( 6.75 కోట్లు), దీపక్‌ హుడా (5.75 కోట్లు), మనీశ్‌ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్‌ మయేర్స్ (50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్‌( వీరంద‌రికీ 20 లక్షలు).

Story first published: Wednesday, March 23, 2022, 21:25 [IST]
Other articles published on Mar 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+