న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్.. ఆ స్టార్ బౌల‌ర్ వ‌చ్చేస్తున్నాడు

IPL 2022: Lucknow Super Giants bowler Dushmantha Chamira has recovered from injury will play in IPL 2022

మ‌రో వారం రోజుల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓ గుడ్ న్యూస్ అందింది. గాయం కార‌ణంగా భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు దూర‌మైన శ్రీ‌లంక స్టార్ పేస‌ర్ దుష్మంత చమీరా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో చ‌మీర ఐపీఎల్ 2022లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు అందుబాటులో ఉండ‌నున్నాడు.

చ‌మీరా వ‌చ్చేస్తున్నాడు

చ‌మీరా వ‌చ్చేస్తున్నాడు

కొంత‌కాలంగా మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్న శ్రీ‌లంక బౌల‌ర్ దుష్మంత్ చ‌మీరా భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో రానున్న ఐపీఎల్‌లోనూ ఆడ‌తాడా? లేదా? అనే అనుమానాలు నెల‌కొన్నాయి. తాజాగా గాయం నుంచి పూర్తిగా కోలుకున్న చ‌మీరా త్వ‌ర‌లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2022లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు అందుబాటులో ఉండ‌నున్నాడు. కాగా మెగా వేలంలో చ‌మీరాను లక్నో 2 కోట్ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది. అలాగే చ‌మీరా ఐపీఎల్‌లో ఆడ‌నుండ‌డం ఇదే మొద‌టి సారి కానుంది. గ‌తంలో 2018లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసిన‌ప్ప‌టికీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించ‌లేదు.

 గాయంతో ఔట్‌

గాయంతో ఔట్‌

చ‌మీరా జ‌ట్టులోకి అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు మ‌రో దెబ్బ త‌గ‌లింది. మెగా వేలంలో ఆ జ‌ట్టు కొనుగోలు చేసిన ఇంగ్లండ్ బౌల‌ర్‌ మార్క్ వుడ్ మోచేతికి ఆంటిగ్వా వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌ర‌గిన తొలి టెస్టు మ్యాచ్‌లో గాయ‌మైంది. దీంతో అత‌ను రెండో టెస్టు మ్యాచ్ ఆడ‌డం లేదు. తాజాగా గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని తేల‌డంతో కొంత‌కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్ర‌మంలో ఈ సారి ఐపీఎల్‌కు పూర్తిగా దూర‌మ‌య్యాడు. కాగా మెగా వేలంలో మార్క్ వుడ్‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 7 కోట్ల 50 ల‌క్ష‌ల రూపాయ‌ల భారీ ధ‌ర వెచ్చించి కొనుగోలు చేసింది. 140 నుంచి 150 కిలో మీట‌ర్ల వేగంతో బంతులు విసిరే మార్క్ వుడ్ అవ‌స‌ర‌మైన‌ప్పుడు బ్యాట్‌తోనూ రాణించ‌గ‌ల‌డు. కాగా మార్క్ వుడ్ స్థానంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఎవ‌రిని జ‌ట్టులో చేర్చుకుంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ల‌క్నో షెడ్యూల్‌

ల‌క్నో షెడ్యూల్‌

కేఎల్ రాహుల్ నేతృత్వంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఈ నెల 28న త‌న ప్రారంభ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. 31న చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో, ఏప్రిల్ 4న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో, 7న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో, 10న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో, 16న ముంబై ఇండియ‌న్స్‌తో, 19న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో, 24న ముంబై ఇండియ‌న్స్‌తో, 29న పంజాబ్ కింగ్స్‌తో, మే 1న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో, 7న కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్‌తో, 10న గుజ‌రాత్ టైటాన్స్‌తో, 15న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో, ఇక 18న చివ‌రి మ్యాచ్‌లో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

 ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పూర్తి జ‌ట్టు

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పూర్తి జ‌ట్టు

కేఎల్‌ రాహుల్ (17 కోట్లు), మార్కస్ స్టొయినిస్ (9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), అవేశ్‌ ఖాన్ (10 కోట్లు), జాసన్ హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్య (8.25 కోట్లు), మార్క్‌ వుడ్ (7.50 కోట్లు), క్వింటన్ డికాక్ ( 6.75 కోట్లు), దీపక్‌ హుడా (5.75 కోట్లు), మనీశ్‌ పాండే (4.60 కోట్లు), దుష్మాంత చమీరా (2 కోట్లు), ఎవిన్ లూయిస్ ( 2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ సింగ్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కేల్‌ మయేర్స్ (50 లక్షలు), మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్‌( వీరంద‌రికీ 20 లక్షలు).

Story first published: Friday, March 18, 2022, 16:15 [IST]
Other articles published on Mar 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X