Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా..బుల్లెట్ దిగిందా? లేదా?: లక్నో హ్యాట్రిక్ విక్టరీస్

 IPL 2022: Lucknow Super Gaints Registers There 1st Hatrick Wins In IPL

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. కొన్ని అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అసాధారణ విజయాలు, అదే స్థాయిలో అపజయాలు నమోదవుతున్నాయి. టైటిల్ హాట్ ఫేవరెట్స్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌గా పేరున్న జట్లు వరుసగా ఓటమి పాలవుతున్నాయి. ఇదివరకటి సీజన్లల్లో ఫర్వాలేదనిపించిన జట్లు తిరుగులేని గెలుపులను అందుకుంటోన్నాయి. స్టార్లతో నిండివున్న జట్లేవీ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ 5లో లేవు.

కొత్త జట్ల గ్రాండ్ ఎంట్రీ..

కొత్త జట్ల గ్రాండ్ ఎంట్రీ..

ఈ సీజన్‌తోనే ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్- అద్భుతంగా రాణిస్తోన్నాయి. పాయింట్ల పట్టికలో 2, 4 స్థానాలను ఆక్రమించుకున్నాయి. ఈ రెండు జట్ల దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వంటి జట్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఆయా జట్ల ముందు మోకరిల్లాల్సి వచ్చింది. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం, ఐపీఎల్ స్టార్లతో నిండివున్న ఢిల్లీ కేపిటల్స్ జట్టు- ఈ రెండింటి చేతుల్లో దారుణంగా ఓడింది.

లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విక్టరీస్..

లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విక్టరీస్..

లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. ఈ సీజన్‌లో ఈ ఫీట్‌ను సాధించిన తొలి జట్టు ఇదే. కొత్తగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. వరుస విజయాలను నమోదు చేయడం ఓ రికార్డే. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ చేతిలో ఓడిన అనంతరం ఇక వెనుదిరిగి చూసుకోలేదా జట్టు. ఆ తరువాతి మూడు మ్యాచ్‌లల్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ కేపిటల్స్‌ను ఓడించింది. ఈ మూడు జట్లు కూడా సుదీర్ఘకాలంగా ఐపీఎల్ ఆడుతున్నాయి.

కేఎల్ రాహుల్ కేప్టెన్సీ.. ఫిదా

కేఎల్ రాహుల్ కేప్టెన్సీ.. ఫిదా

లక్నో సూపర్ జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ సారథ్యాన్ని వహిస్తోండటం కలిసి వచ్చింది. అటు కేప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా డ్యూయల్ రోల్‌ చేస్తోన్నాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మిగిలిన మూడు మ్యాచ్‌లల్లో అతని వ్యక్తిగత స్కోరు 40, 68, 24. కేప్టెన్‌గా ప్రత్యర్థి జట్టును ఇరుకున పడేసేలా వ్యూహాలను రూపొందించుకోవడం, దాన్ని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడంలో అతను సక్సెస్ అయ్యాడు.

IPL 2022 DC Vs LSG Match Highlights | Oneindia Telugu
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో..

పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో..

ఈ హ్యాట్రిక్ విజయాలతో లక్నో సూపర్ జెయింట్స్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. నాలుగు మ్యాచ్‌లల్లో మూడు విజయాలతో ఆరు పాయింట్లు ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. ఈ ఆదివారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడనుంది లక్నో. రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖెడె స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. తన జైత్రయాత్రను కొనసాగిస్తుందా? లేదా అనేది తేలుతుంది.

నో స్టార్ టీమ్స్..

నో స్టార్ టీమ్స్..

ఐపీఎల్‌ పాయింట్ల పట్టిక తొలి అయిదు స్థానాల్లో స్టార్ జట్లేవీ లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లుగా పేరున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయి. సీజన్ ఆరంభమై ఇన్ని రోజులవుతున్నప్పటికీ.. ఒక్క విజయాన్ని కూడా అందుకోలేదీ రెండూ. ఢిల్లీ కేపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ దీనికి మినహాయింపేమీ కాదు. సన్‌రైజర్స్ ఒక్క మ్యాచ్‌నూ గెలవలేదు. ఢిల్లీ తొలి మ్యాచ్ గెలిచినా.. తరువాతి రెండింట్లో ఓడింది. ఈ నాలుగు జట్లు చివరి స్థానాల్లో నిలిచాయి.

Story first published: Friday, April 8, 2022, 9:48 [IST]
Other articles published on Apr 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+