For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ చేసిన తప్పే రిపీట్: సెంచరీ బాయ్‌ కేఎల్‌ రాహుల్‌పై ఫైన్ పడిందిగా

IPL 2022, LSG vs MI: LSG captain KL Rahul was fined Rs 12 lakh for maintained a slow over rate

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌ పీక్స్‌లో సాగుతోంది. అన్ని జట్లు అయిదు చొప్పున మ్యాచ్‌లను ఆడేశాయి. అనూహ్య ఫలితాలను అందించాయి. అసాధారణ విజయాలు, అదే స్థాయిలో అపజయాలు నమోదవుతున్నాయి. టైటిల్ హాట్ ఫేవరెట్స్, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌గా పేరున్న జట్లు వరుసగా ఓటమి పాలవుతున్నాయి. ఇదివరకటి సీజన్లల్లో ఫర్వాలేదనిపించిన జట్లు తిరుగులేని గెలుపులను అందుకుంటోన్నాయి.

ఈ సీజన్‌తోనే ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్- అద్భుతంగా రాణిస్తోన్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు ఈ రెండింటివే. ఈ రెండు జట్ల దెబ్బకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ వంటి మేటి జట్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ముందు మోకరిల్లాల్సి వచ్చింది. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం, ఐపీఎల్ స్టార్లతో నిండివున్న ముంబై ఇండియన్స్ మళ్లీ ఓడింది.

లక్నో సూపర్ జెయింట్స్ చిన్న గ్యాప్ తరువాత తన జైత్రయాత్రను మళ్లీ మొదలు పెట్టినట్టే. వరుసగా మూడింట్లో విజయం సాధించిన తరువాత నాలుగో మ్యాచ్‌లో ఓడింది లక్నో టీమ్. అయిదో మ్యాచ్‌లో గెలిచింది. 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను మట్టి కరిపించింది. డబుల్ హ్యాట్రిక్ ఓటమిని పరిచయం చేసింది. తొలుత బ్యాటింగ్‌లో.. అనంతరం బౌలింగ్‌లో సత్తా చాటిందీ కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో టీమ్. రోహిత్ సేనను ఈ మెగా టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్లేలా చేయడంలో తానూ ఓ చెయ్యి వేసింది.

IPL 2022, LSG vs MI: LSG captain KL Rahul was fined Rs 12 lakh for maintained a slow over rate

ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అతని వందో మ్యాచ్ కావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. వందో మ్యాచ్‌లో వంద పరుగులు చేసిన తొలి ఆటగాడితడే. 60 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఇందులో అయిదు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. క్వింటన్ డికాక్, మనీష్ పాండే రాణించడంతో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది లక్నో. ఆ లక్ష్యాన్ని ఛేదించడం ముంబై వల్ల కాలేదు. 181 పరుగుల వద్దే చతికిల పడింది.

మ్యాచ్‌ను గెలిచిన ఆనందంలో ఉన్న సెంచరీ బాయ్ కేఎల్ రాహుల్‌పై భారీ జరిమానా పడింది. ఇదివరకు రోహిత్ శర్మ సహా ఒకరిద్దరు కేప్టెన్లు చేసిన తప్పును అతనూ పునరావృతం చేశాడు. స్లో ఓవర్ రన్‌రేట్‌ను మెయింటెయిన్ చేశాడు. ఫలితంగా 12 లక్షల రూపాయాల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇది తొలి తప్పు. రెండోసారి కూడా అదే జరిగితే- జరిమానా మొత్తం డబుల్ అవుతుంది. 24 లక్షల రూపాయలకు చేరుతుంది. కేప్టెన్‌తో పాటు మిగిలిన 10 మంది ప్లేయర్లూ ఆరు లక్షల రూపాయల చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

Story first published: Sunday, April 17, 2022, 7:45 [IST]
Other articles published on Apr 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+