Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs KKR Playing 11: గుజరాత్ బోల్తా కొడుతున్న వేళ..ప్లేఆఫ్స్‌ తొలి ఎంట్రీపై కన్నేసిన లక్నో

IPL 2022, LSG vs KKR playing 11: Lucknow Super Giants aim to shore up playoff chances

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌‌ సెకెండ్ హాఫ్ రసవత్తరంగా మారింది. ఒక్క విజయం సాధించగలిగితే ప్లేఆఫ్స్‌లోకి దర్జాగా అడుగు పెట్టే దశలో గుజరాత్ టైటాన్స్ బొక్క బోర్లా పడుతోంది. వరసగా రెండో మ్యాచ్‌లల్లో బోల్తా కొట్టింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే- ప్లేఆఫ్స్‌లోకి చేరిన తొలి జట్టుగా ఆవిర్భవించగలుగుతుందీ టీమ్. ఆ ఒక్క విజయాన్ని అందుకోవడానికి నానాతంటాలు పడుతోంది. శుక్రవారం రాత్రి ముంబై సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో దారుణంగా ఓడింది గుజరాత్ టైటాన్స్‌.

గుజరాత్ ఓటమిని సొమ్ము చేసుకుంటోన్న లక్నో..

గుజరాత్ ఓటమిని సొమ్ము చేసుకుంటోన్న లక్నో..

గుజరాత్ టైటాన్స్ వరుస ఓటములను తనకు అనుకూలంగా మార్చుకోవడంపై దృష్టి సారించింది లక్నో సూపర్ జెయింట్స్. ఈ పరిణామాలను సొమ్ము చేసుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే- గుజరాత్‌తో సమానంగా నిలుస్తుందీ కేఎల్ రాహుల్ టీమ్. మంచి రన్‌రేట్‌తో ప్రత్యర్థిని ఓడించగలిగితే పాయింట్స్ టేబుల్ టాపర్‌గా నిలవడమూ ఖాయమౌతుంది. ఇన్ని రోజులూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగిన గుజరాత్ టైటాన్స్.. కీలక దశలో మెట్టు దిగినట్టవుతుంది.

 కీలక మ్యాచ్..

కీలక మ్యాచ్..

ఈ పరిస్థితుల మధ్య లక్నో సూపర్ జెయింట్స్ ఇవ్వాళ.. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో తలపడబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్.. ఆల్‌రెడీ సేఫ్ జోన్‌లో ఉంది. 10 మ్యాచ్‌లల్లో ఏడింట్లో విజయాలను సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఘన విజయాన్ని అందుకుంది. కోల్‌కత నైట్‌రైడర్స్‌పై మంచి రన్‌రేట్‌తో గెలిస్తే అగ్రస్థానానికి చేరుతుంది.

ఊపుమీదున్న కేఎల్

ఊపుమీదున్న కేఎల్

ఈ సీజన్‌లో రెండు సెంచరీలతో కేఎల్ రాహుల్ ఊపు మీదున్నాడు. క్వింటన్ డికాక్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. మిడిలార్డర్‌లో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, లోయర్ ఆర్డర్‌లో జేసన్ హోల్డర్, మార్కస్ స్టొయినిస్ సత్తా చాటుతున్నారు. దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్యాలతో అటు బౌలింగ్ విభాగం బలంగా ఉంది. జట్టు మొత్తం నిలకడగా రాణిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో కలిసికట్టుగా ఆడుతోంది.

అవేష్ ఖాన్ లేదా గౌతమ్

అవేష్ ఖాన్ లేదా గౌతమ్

ఒక్క మార్పుతో లక్నో సూపర్ జెయింట్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తుది జట్టులోకి అవేష్ ఖాన్‌ లేదా కృష్ణప్ప గౌతమ్‌ను తీసుకోవచ్చు. అంతకుమించిన మార్పులేవీ ఉండకపోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చోటు చేసే ఛాన్స్ ఉంది. లోయర్ ఆర్డర్‌లో ఆడుతున్న ఆయుష్ బదోనిని టాప్ ఆర్డర్‌లోకి తీసుకొచ్చేలా వ్యూహాలను రూపొందించుకుందనే అంచనాలు ఉన్నాయి. వరుసగా విఫలమౌతున్న మనీష్ పాండేకు ఈ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశాలు లేనట్టే.

కోల్‌కత.. పాత కథ

కోల్‌కత.. పాత కథ

ఐపీఎల్‌ 2022 సీజన్‌ సెకెండ్ హాఫ్‌లోనూ కోల్‌కత నైట్‌రైడర్స్ పుంజుకోవట్లేదు. చివరి అయిదు మ్యాచ్‌లల్లో గెలిచింది ఒక్కటే. తన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ఈ టోర్నమెంట్‌ మొత్తం మీద నాలుగు విజయాలనే అందుకుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు చేజారినట్టే. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు తోడుగా నిలిచింది.

తుదిజట్టు కూర్పు ఇలా..

తుదిజట్టు కూర్పు ఇలా..

లక్నో సూపర్ జెయింట్స్‌ తుదిజట్టులో- క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కేప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, అవేష్ ఖాన్/కృష్ణప్ప గౌతమ్, మొహసిన్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్ ఆడొచ్చు. కోల్‌కత నైట్‌రైడర్స్ తుదిజట్టులో- బాబా ఇంద్రజిత్ (వికెట్ కీపర్), ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Saturday, May 7, 2022, 8:00 [IST]
Other articles published on May 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+