Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs KKR Playing 11: లీగ్స్‌లో ఫైనల్స్: ప్లేఆఫ్స్ ముగింట్లో తచ్చాడుతున్న జట్టులో ఆ మార్పు

IPL 2022, LSG vs KKR playing 11: Baba Indrajith to replace injured Ajinkya Rahane

ముంబై: ఐపీఎల్‌ 2022 సీజన్‌‌‌ లీగ్ దశ చిట్టచివరి రౌండ్‌లో అడుగు పెట్టింది. ఇవ్వాళ్టి నుంచి చివరి మ్యాచ్‌లు బిగిన్ కానున్నాయి. 22వ తేదీ నాటికి లీగ్ దశ ముగుస్తుంది. ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించిన తరువాత ఈక్వేషన్స్ మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో రెండు కీలక జట్లు ఈ సాయంత్రం తలపడనున్నాయి. ఇందులో గెలిచిన ఓ జట్టు దర్జాగా ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెడుతుంది.

సన్‌రైజర్స్ గెలుపుతో..

సన్‌రైజర్స్ గెలుపుతో..

వరుసగా అయిదు మ్యాచ్‌లను ఓడిపోయిన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ విజయాన్ని అందకుంది. ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకేసింది. వాంఖెడె స్టేడియంలో లోకల్ టీమ్ ముంబై ఇండియన్స్‌ను మట్టి కరిపించింది. తన ఖాతాలో ఉన్న పాయింట్ల సంఖ్యను 12కు పెంచుకోగలిగింది. తన చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఇందులో నెగ్గినా కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్లేఆఫ్స్ చేరడానికి ఉన్న అవకాశాలు తక్కువే.

అదే స్థితిలో కోల్‌కత..

అదే స్థితిలో కోల్‌కత..

సరిగ్గా అలాంటి దశలోనే ఉంది కోల్‌కత నైట్‌రైడర్స్. 12 పాయింట్లు ఉన్న ఈ జట్టు ఇవ్వాళ లక్నో సూపర్ జెయింట్స్‌ను ఎదుర్కొనబోతోంది. నవీముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమి స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ రెండింటికీ ఇదే చివరి మ్యాచ్. కోల్‌కత నైట్‌రైడర్స్ గెలిస్తే-దాని ప్రస్థానం 14 పాయింట్ల వద్ద ఆగిపోతుంది. ఇతర జట్ల గెలుపోటముల మీద దీని భవితవ్యం ఆధారపడి ఉంటుంది. భారీ రన్‌రేట్‌తో ఈ మ్యాచ్‌ను గెలవాల్సి ఉంటుంది నైట్‌రైడర్స్‌కు.

అజింక్య స్థానంలో..

అజింక్య స్థానంలో..

కోల్‌కత ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. హ్యార్మ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీతో బాధపడుతున్న అజింక్య రహానె స్థానంలో బాబా ఇంద్రజిత్‌ను తుదిజట్టులోకి తీసుకోనుంది. అతన్ని ఓపెనర్‌గా పంపించడం ఖాయం. వెంకటేష్ అయ్యర్‌తో కలిసి బాబా ఇంద్రజిత్ ఇన్నింగ్‌ను ఆరంభిస్తాడు. చివరి రెండు మ్యాచ్‌లల్లో గెలవడం వల్ల నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఈ చిట్టచివరి మ్యాచ్‌లో గెలిస్తే 14 పాయింట్లతో రేసులో ఉంటుంది.

గెలిస్తే ప్లేఆఫ్స్..

గెలిస్తే ప్లేఆఫ్స్..

లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్ ఖాయమనుకున్న దశలో వరుసగా రెండింట్లో ఓడింది కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో జెయింట్స్. ఫలితంగా- ప్లేఆఫ్స్ ముగింట్లోనే తచ్చాడుతోంది. గెలిస్తే- 18 పాయింట్లతో దర్జాగా ప్లేఆఫ్స్‌లోకి అడుగు పెడుతుంది. ఈ ఘనత సాధించిన రెండో జట్టవుతుంది. గుజరాత్ టైటాన్స్ ఆల్‌రెడీ ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే. ఆ గెలుపు కోసం ఎదురు చూస్తోంది. చివరి రెండు మ్యాచ్‌లల్లో ఓడింది. హ్యాట్రిక్ పరాజయాన్ని అందుకుంటుందా? లేక ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇస్తుందా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

 రిథమ్ కోల్పోయిన లక్నో బ్యాటింగ్..

రిథమ్ కోల్పోయిన లక్నో బ్యాటింగ్..

లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్‌లో నిలకడ కోల్పోవడం వల్ల ఈ రెండు పరాజయాలు పలకరించాయి. కేఎల్ రాహుల్ సహా బ్యాటర్లెవరూ పెద్దగా రాణించట్లేదు. క్వింటన్ డికాక్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, లోయర్ ఆర్డర్‌లో జేసన్ హోల్డర్, మార్కస్ స్టొయినిస్ తమ స్థాయికి తగ్గట్లుగా ఆడట్లేదు. దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్యాలతో అటు బౌలింగ్ విభాగం బలంగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ నీరసించడం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది.

తుదిజట్టు కూర్పు ఇలా..

తుదిజట్టు కూర్పు ఇలా..

లక్నో సూపర్ జెయింట్స్‌ తుదిజట్టులో- క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కేప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్, అవేష్ ఖాన్, మొహసిన్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్ ఆడొచ్చు. కోల్‌కత నైట్‌రైడర్స్ తుదిజట్టులో- బాబా ఇంద్రజిత్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Wednesday, May 18, 2022, 7:19 [IST]
Other articles published on May 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+