ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో లక్నో జెయింట్స్ పల్టీ: స్పిన్ ఉచ్చులో గిలగిల: ఓటమికి కారణాలివే

ముంబై: ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్ ముంగిట్లో లక్నో సూపర్ జెయింట్స్ పల్టీ కొట్టింది. వరుస విజయాలతో అగ్రస్థానానికి చేరుకున్న ఈ కొత్త జట్టు.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడింది. ఏకంగా 62 పరుగుల తేడాతో కుదేల్ అయింది. ఈ మ్యాచ్‌లో ఘన విజయంతో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ఆవిర్భవించింది.

లో-స్కోర్ మ్యాచ్..
తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్.. 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరోసారి రాణించాడు. 63 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మాథ్యూవేడ్, హార్దిక్ పాండ్యా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. డేవిడ్ మిల్లర్-26, రాహుల్ తెవాతియా-22 పరుగులు చేయడంతో గుజరాత్ స్కోర్ బోర్డుపై ఆ పరుగులైనా జమ అయ్యాయి. ఆ మాత్రం స్కోర్‌ను కూడా ఛేదించలేకపోయింది లక్నో సూపర్ జెయింట్స్.

ఒత్తిడితో చిత్తు..
ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్‌లో చేరుకుంటామనే ఒత్తిడిలో ఆడినట్టు కనిపించారు లక్నో జెయింట్స్ బ్యాటర్లు. కేప్టెన్ కేఎల్ రాహుల్ సహా బ్యాటర్లందరిదీ ఫ్లాప్ షో. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అవేష్ ఖాన్-12, ఓపెనర్ క్వింటన్ డికాక్-11, టాప్ ఆర్డర్‌లో దీపక్ హుడా-27 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారంటే- బ్యాటింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేఎల్ రాహుల్-8, కరణ్ శర్మ-4, కృనాల్ పాండ్యా-5, ఆయుష్ బదోని-8, మార్కస్ స్టొయినిస్-2, జేసన్ హోల్డర్-1, మొహసిన్ ఖాన్-1.. ఇలా సాగింది బ్యాటింగ్ తీరు.

బౌలింగ్ రాణించినా..
లక్నో జెయింట్స్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ సత్తా చాటినప్పటికీ.. బ్యాటింగ్ దెబ్బకొట్టింది. జేసన్ హోల్డర్, దుష్మంత చమీర మినహా మిగిలిన బౌలర్లు పొదుపుగా బౌల్ చేశారు. అవేష్ ఖాన్-2, మొహసిన్ ఖాన్, జేసన్ హోల్డర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. బౌలర్లు కష్టాన్ని బ్యాటర్లు నీళ్లపాలు చేశారు. 145 పరుగులు చేయలేక చేతులెత్తేశారు. పైగా భారీ తేడాతో ఓడిపోయారు. వరుస విజయాలతో అగ్రస్థానానికి దూసుకొచ్చి జట్టు ఇదేనా అనిపించింది.

స్పిన్, పేస్‌ను ఎదుర్కొనలేక..
స్పిన్, పేస్ బౌలింగ్‌ను లక్నో బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయారు. కనీసం ప్రతిఘటించనూ లేదు. మహ్మద్ షమీ మూడు ఓవర్లల్లో అయిదే పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అల్జారీ జోసెఫ్‌దీ అదే పరిస్థితి. రెండు ఓవర్లల్లో 14 పరుగులు ఇచ్చాడు. రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో లక్నో జెయింట్స్ నడ్డి విరిచాడు. 3.5 ఓవర్లల్లో 24 పరుగులుకు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. యష్ దయాళ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, యష్ దయాళ్ రెండు చొప్పున వికెట్లు కూల్చారు.

22 పరుగులకు అయిదు వికెట్లు..
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్‌లో ఎక్కడ కూడా భారీ భాగస్వామ్యం కనిపించలేదు. 19 పరుగుల వద్ద తొలి వికెట్ పడగా.. అదే సీన్ కంటిన్యూ అయింది. క్రమం తప్పకుండా వికెట్లు నేల రాలాయి. చివరి అయిదు వికెట్లను 22 పరుగుల తేడాతో కోల్పోయింది లక్నో. 13.5 ఓవర్లల్లో 82 పరుగులకు చాప చుట్టేసింది. లక్ష్యం చిన్నదే కావడం వల్ల ఏ ఒక్క బ్యాటర్ క్రీజ్‌లో కుదురుకుని ఉన్నా.. పరిస్థితి మరోలా ఉండేది. లాంఛనంగా ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాన్ని చేజార్చుకుంది.

కొంపముంచిన స్టంపౌట్స్
మిడిలార్డర్‌లో కృనాల్ పాండ్యా, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్ వంటి భారీ హిట్టర్లు తడబడ్డారు. షాట్ సెలెక్షన్స్‌లో పొరపాట్లు చేశారు. వికెట్లు పడుతున్న దశలో అనవసరంగా భారీ షాట్లకు వెళ్లి అవుట్ అయ్యారు. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే అయినా.. చాలినన్ని ఓవర్లు చేతిలోనే ఉన్నా భారీ షాట్లకు వెళ్లి.. వికెట్లను చేజేతులా పోగొట్టుకున్నారు. కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని క్రీజ్‌ను వదిలి మరీ ముందుకొచ్చి ఆడబోయి స్టంపవుట్ అయ్యారు. క్రీజ్‌ను వదిలి ముందుకు రావాల్సిన అవసరమే లేదా పరిస్థితిలో. ఇంకా రెండు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది రాహుల్ సేనకు. రాజస్థాన్ రాయల్స్, అనంతరం కోల్‌కత నైట్‌రైడర్స్ మ్యాచ్‌తో లీగ్ దశను ముగించుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications