Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు 50+ ర‌న్స్ తేడాతో గెలిచిన టాప్ 5 జ‌ట్లు ఇవే!

IPL 2022: List of top 5 teams with the most wins by 50 plus runs in IPL history

ఐపీఎల్ 2022 జోరుగా సాగుతుంది. జ‌ట్ల‌న్నీ హోరాహోరీగా త‌ల‌ప‌డ‌తుండ‌డంతో మ్యాచ్‌లు ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్నాయి. ప‌లు మార్లు జ‌ట్లు 200కు ల‌క్ష్యాల‌ను కూడా చేధిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి చేధ‌న‌లు ఐపీఎల్ 2022లో ఇప్పటికే రెండు సార్లు జ‌రిగాయి. అయితే ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ 54 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధిచింది. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు 50 ప‌రుగుల‌కు పైగా తేడాతో గెలిచిన జ‌ట్లు ఏవ‌నే చ‌ర్చ ప్ర‌స్తుతం సాగుతుంది.

50+ ప‌రుగుల తేడాతో అత్య‌ధిక సార్లు గెలిచిన జ‌ట్ల జాబితాలో డిఫెండింగ్ చెన్నైసూప‌ర్ కింగ్స్ మొద‌టి స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో 50+ ప‌రుగుల తేడాతో గెలిచింది. ఇక 12 సార్లు 50+ ర‌న్స్ తేడాతో గెలిచిన ముంబై ఇండియ‌న్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. 9 సార్లు ప్ర‌త్య‌ర్థుల‌ను 50+ ప‌రుగుల తేడాతో ఓడించిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మూడో స్థానంలో ఉంది. ఇక రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 8 మ్యాచ్‌ల్లో 50+ ప‌రుగుల తేడాతో గెలిచింది. ఈ జాబితాలో రాజ‌స్థాన్ నాల్గో స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ 7 సార్లు 50+ ప‌రుగుల తేడాతో గెలిచి ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది.

ఐపీఎల్‌లో నేడు ఆస‌క్తిర పోరు జ‌ర‌గ‌నుంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. డాక్ట‌ర్ డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం వేదిక‌గా రాత్రి 7:30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

IPL 2022: List of top 5 teams with the most wins by 50 plus runs in IPL history

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (కీపర్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్కరమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియా షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, శ్రేయాస్ గోపాల్.

ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ తుది (అంచ‌నా)
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింట‌న్ డికాక్ (కీప‌ర్‌), మనీశ్ పాండే, లూయిస్, బదోని, హుడా, కృనాల్ పాండ్యా, మొహ్ సిన్, ర‌వి బిష్ణోయ్, చమీర, అవేశ్ ఖాన్.

Story first published: Monday, April 4, 2022, 17:02 [IST]
Other articles published on Apr 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+