Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ఐపీఎల్‌లో అత్య‌ధిక‌ జ‌ట్ల‌కు ఆడిన ఆట‌గాళ్లు ఎవ‌రో తెలుసా?

IPL 2022: List of players who have played for most of the franchises in the IPL
IPL 2022 Mega Auction: Most Expensive Indian Pacer| CSK | SRH | Oneindia Telugu

క్రికెట్ అభిమానుల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సంవ‌త్స‌రంలో ఈ లీగ్ ఉండేది రెండు నెల‌లే అయిన‌ప్ప‌టికీ, దీని కోసం అభిమానులు ఏడాదంతా ఎదురుచూస్తుంటారు. ఇక ఐపీఎల్‌లో ఆడే టీంల గురించి, ఆట‌గాళ్ల గురించి సంవ‌త్స‌రం మొత్తం చ‌ర్చించుకుంటూ ఉంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అభిమానులు ఓ విష‌యమై తెగ చ‌ర్చించేస్తున్నారు. అదేంటంటే ఇప్ప‌టివ‌ర‌కు ముగిసిన ఐపీఎల్ సీజ‌న్ల‌లో ఎక్కువ టీంల‌కు ఏ ఆట‌గాడు ఆడాడ‌నే విష‌యం గురించి చ‌ర్చిస్తున్నారు.

ఎక్కువ టీంల‌కు ఆడిన ఆట‌గాడు

ఇప్ప‌టివ‌ర‌కు ముగిసిన 15 ఐపీఎల్ సీజ‌న్ల‌లో ఎక్కువ టీంల‌కు ఆడిన ఆట‌గాడిగా ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ నిలిచాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఫించ్ రికార్డు స్థాయిలో ఏకంగా 8 టీంల‌కు ఆడాడు. ఈ ఏడాది వ‌స్తున్న కొత్త టీంల‌తో పాటు ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, చెన్నైసూప‌ర్ కింగ్స్‌ను ప‌క్క‌న పెడితే లీగ్‌లోని మిగ‌తా అన్ని టీంల త‌ర‌ఫున ఫించ్ ఆడాడు. ఫించ్ ఆడిన టీంల‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్‌, పుణే వారియ‌ర్స్ ఇండియా, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్‌, గుజ‌రాత్ ల‌య‌న్స్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. కాగా ఈ సీజ‌న్లో కూడా ఫించ్ ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నాడు. ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 87 మ్యాచ్‌లు ఆడిన ఆరోన్ ఫించ్ 25 స‌గ‌టుతో 2005 ప‌రుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు ఉండ‌గా.. అత్య‌ధిక స్కోర్ 88 ప‌రుగులు.

 ఆరేసి టీంల‌కు ఆడిన ఐదుగురు

ఆరేసి టీంల‌కు ఆడిన ఐదుగురు

ఇక ఫించ్ త‌ర్వాతి స్థానంలో ఆరేసి టీంల‌కు ఆడిన ఐదుగురు ప్లేయ‌ర్లు ఉన్నారు. వారు దినేశ్ కార్తీక్, ఇషాంత్ శ‌ర్మ‌, యువ‌రాజ్ సింగ్‌, తిశ్రా పెరీరా, పార్ధివ్ ప‌టేల్‌గా ఉన్నారు. ఇందులో దినేశ్ కార్తీక్ పంజాబ్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, రాయల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ ల‌యన్స్ జ‌ట్ల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఈ క్ర‌మంలో లీగ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 213 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 25 స‌గ‌టుతో 4046 ప‌రుగులు చేశాడు. ఇక మ‌రో ఆట‌గాడు ఇషాంత్ శ‌ర్మ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, డెక్క‌న్ చార్జ‌ర్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ర‌ఫున ఆడాడు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టివ‌ర‌కు 93 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ శ‌ర్మ 72 వికెట్లు తీశాడు.

యువ‌రాజ్ ఆడిన టీంలు

యువ‌రాజ్ ఆడిన టీంలు

ఐపీఎల్‌లో యువ‌రాజ్‌సింగ్ పంజాబ్ కింగ్స్‌, పుణే వారియ‌ర్స్ ఇండియా, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఆడాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో 132 మ్యాచ్‌లు ఆడిన యువ‌రాజ్ 24 స‌గ‌టుతో 2750 ప‌రుగులు చేశాడు. అలాగే 36 వికెట్లు కూడా ప‌డ‌గొట్టాడు. ఇక శ్రీ‌లంక ప్లేయ‌ర్ తిశ్రా పెరీరా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, కొచ్చి ట‌స్క‌ర్స్ కేర‌ళ‌, ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, పంజాబ్ కింగ్స్ జ‌ట్ల త‌ర‌ఫున ఆడాడు. ఈ క్రమంలో 37 మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు తీశాడు.

పార్ధివ్ పటేల్ ఆడిన‌ టీంలు

పార్ధివ్ పటేల్ ఆడిన‌ టీంలు

ఐపీఎల్‌లో వికెట్ కీప‌ర్ పార్ధివ్ ప‌టేల్ చెన్నైసూప‌ర్ కింగ్స్, కొచ్చి ట‌స్క‌ర్స్ కేర‌ళ‌, ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ర‌ఫున ఆడాడు. ఈ క్ర‌మంలో 22 సగ‌టుతో 2848 ప‌రుగులు చేశాడు.

Story first published: Thursday, February 3, 2022, 13:48 [IST]
Other articles published on Feb 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+