
ముంబై, చెన్నై ఓపెనర్లు వీళ్లే
ఐపీఎల్‌లో అత్యంత విజయంతమైన టీంలుగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పేరుగాంచాయి. అయితే ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను ఈ సారి కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ప్రారంభించనున్నారు. గత సీజన్లలో రోహిత్‌లో కలిసి క్వింటన్ డికాక్ ఓపెనర్‌గా వచ్చేవాడు. కానీ ఈ సారి డికాక్ జట్టులో లేకపోవడంతో రోహిత్‌కు జతగా కిషన్ ఇన్నింగ్‌ను ప్రారంభించనున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను రుతురాజ్ గైక్వాడ్, న్యూజిలాండ్ ఆటగాడు డేవాన్ కాన్వే కలిసి ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కోల్‌కతా, సన్‌రైజర్స్ ఓపెనర్లు ఎవరంటే..
ఐపీఎల్‌లో రెండు సార్లు ట్రోఫీ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌ను వెంకటేశ్ అయ్యర్ ప్రారంభిచడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అతనికి జతగా టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానే లేదా హేల్స్‌లో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే తమ ఓపెనర్లను అధికారికంగా ప్రకటించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని సన్‌రైజర్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ వెల్లడించాడు.

రాజస్థాన్, ఢిల్లీ ఓపెనర్లు ఇదిగో
ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ట్రోఫీ గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను ఈ సారి యశస్సి జైస్వాల్ ప్రారంభించనున్నాడు. అతని తోడుగా జోస్ బట్లర్ లేదా దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లుగా పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఖాయమనే చెప్పుకోవాలి.

ఆర్సీబీ, పంజాబ్ ఓపెనర్లు వీళ్లే
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలుచుకోలేకపోయిన రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసెస్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరిద్దరు ఐపీఎల్‌లో గతంలోనే ఎన్నో మ్యాచ్‌ల్లో ఓపెనర్లుగా ఆడారు. ఇక పంజాబ్ కింగ్స్ జట్టు ఇన్నింగ్స్‌ను శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ ప్రారంభించడం ఖాయమని చెప్పుకోవాలి.

కొత్త జట్ల ఓపెనర్లు వీళ్లేనా?
ఐపీఎల్‌లో ఈ సారి కొత్తగా అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ ప్రారంభించనున్నారు. రాహుల్ అప్పటికే పర్మినెంట్ ఓపెనర్ కాగా, డికాక్ గతంలో ఐపీఎల్‌లో ముంబై తరఫున ఓపెనర్‌గానే ఆడాడు. ఇక ఐపీఎల్‌లో మరో కొత్త జట్టు అయినా గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్‌ను శుభ్‌మన్ గిల్, జేసన్ రాయ్ ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications












