IPL 2022: ఐపీఎల్‌లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్లు ఎవరంటే..

మరో వారం రోజుల్లో క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఇప్పటివరకు నమోదైన రికార్డులపై అభిమానులు ఓ కన్నేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్లు ఎవరని ఆరా తీస్తున్నారు. అయితే ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన రికార్డు ప్రవీణ్ కుమార్ పేరు మీద ఉంది. ఐపీఎల్‌లో ప్రవీణ్ కుమార్ ఇప్పటివరకు 14 మెయిడిన్ ఓవర్లు వేశాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఇర్ఫాన్ పఠాన్ ఉన్నాడు. ఇర్ఫాన్ పఠాన్ ఇప్పటివరకు 10 మెయిడిన్ ఓవర్లు వేశాడు. మూడో స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. భవి ఇప్పటివరకు 9 మెయిడిన్ ఓవర్లు వేశాడు.
ఇక ఎనిమిదేసి మెయిడినో ఓవర్లతో ధావన్ కులకర్ణి, సందీప్ శర్మ, లసిత్ మలింగ నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. అలాగే ఐపీఎల్‌లో 7 మెయిడిన్ ఓవర్లు వేసిన డేల్ స్టెయిన్ ఏడో స్థానంలో ఉన్నాడు. వీరిలో ఈ సీజన్లో భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ మాత్రమే ఆడుతున్నారు. భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడనుండగా.. సందీప్ శర్మ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు.
ఇక ఐపీఎల్ 2022 ఈ నెల 26 నుంచే ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గత సీజన్లో ఫైనల్లో తలపడిన కోల్‌కతానైట్ రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ తలపడనున్నాయి. 10 జట్లు పాల్గొంటున్న ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో లీగ్ స్టేజ్‌లోనే 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగియనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications