IPL 2022: పంజాబ్ చేతిలో సీఎస్కే ఘోరపరాజయం.. ఐపీఎల్‌లో చెన్నై అతి పెద్ద ఓటములు ఇవే!

ఐపీఎల్ 2022ను డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్ నిరాశజనకంగా ఆరంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా మూడు ఆరంభ మ్యాచ్‌ల్లోనూ ఓడి ఇప్పటివరకు లీగ్‌లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కాగా ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఘోర పరాజయం పాలైంది. ఏకంగా 54 పరుగుల భారీ తేడాతో జడేజా ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో సీఎస్కే పరుగుల పరంగా ఎదుర్కొన్న అతిపెద్ద ఓటములు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ముంబై చేతిలో అతిపెద్ద ఓటమి
ఐపీఎల్‌లో పరుగుల పరంగా అతిపెద్ద ఓటమిని చెన్నైసూపర్ కింగ్స్ జట్టు.. ముంబై ఇండియన్స్ చేతిలో ఎదుర్కొంది. 2013లో లీగ్ స్టేజ్‌లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 60 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆ మ్యాచ్‌లో ముంబై విసిరిన 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక చెన్నై 79 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో అతిపెద్ద పరాజయాన్ని ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే 54 పరుగుల తేడాతో ఓడింది. పంజాబ్ విసిరిన 181 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో సీఎస్కే 126 పరుగులకే ఆలౌటైంది.

మూడు, నాల్గో అతి పెద్ద పరాజయాలు ఇవే
ఇక మూడో అతిపెద్ద పరాజయాన్ని చెన్నైసూపర్ కింగ్స్ ఐపీఎల్ 2019లో ముంబై ఇండియన్స్ చేతిలో ఎదుర్కొంది. లీగ్ స్టేజ్‌లో భాగంగా జరిగిన ఆ మ్యాచ్‌లో సీఎస్కే 46 పరుగుల తేడాతో ఘోరపరాజయం పాలైంది. ముంబై విసిరిన 156 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆ మ్యాచ్‌లో సీఎస్కే 109 పరుగులకే కుప్పకూలింది. ఇక నాల్గో అతిపెద్ద పరాజయాన్ని 2014 పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదుర్కొంది. లీగ్ స్టేజ్‌లో భాగంగా జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ విసిరిన 232 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 187 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆ మ్యాచ్‌లో సీఎస్కే 44 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఢిల్లీ చేతిలో అతి పెద్ద ఓటమి
ఇక ఐదో అతిపెద్ద పరాజయాన్ని చెన్నైసూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదుర్కొంది. ఢిల్లీ చేతిలో ఆ జట్టు 2020లో 44 పరుగుల తేడాతో ఓడింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ విసిరిన 176 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో సీఎస్కే 131 పరుగులకే పరిమితమైంది. ఇక ఆరో అతిపెద్ద పరాజయాన్ని మళ్లీ ముంబై ఇండియన్స్ చేతిలో ఎదుర్కొంది. 2015లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో చెన్నై 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2015 ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై విసిరిన 203 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చెన్నై 161 పరుగులకే పరిమితమైంది. కాగా సీఎస్కే ఎదుర్కొన్న టాప్ 6 అతి పెద్ద ఓటముల్లో మూడు ఓటములు ముంబై చేతిలోనే ఉండడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications