పించ్ హిట్టర్‌ను ఎగరేసుకెళ్లిన పంజాబ్: కావ్య పాపపై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఫైర్..అదే మ్యాజిక్

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్.. 15వ ఎడిషన్ రెండో రోజు వేలంపాటు ప్రారంభమైంది. తొలి గంటలోనే ఆల్‌రౌండర్లు, హార్డ్ హిట్టర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయారు. కొంతమంది విదేశీ ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. ఇప్పటిదాకా బలహీనమైన జట్టును సమకూర్చుకుందంటూ ఘాటు విమర్శలను ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇవ్వాళ ఆరంభం నుంచే బిడ్డింగ్స్‌పై దృష్టి సారించింది. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎయిడెన్ మార్క్‌రమ్‌ను జట్టులోకి తీసుకుంది. 2 కోట్ల 60 లక్షల రూపాయలను ఖర్చు చేసింది.

పోరాడినా.. దక్కని ఫలితం
మరో పించ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ కోసం తీవ్రంగా పోరాడింది సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ. పంజాబ్ కింగ్స్-హైదరాబాద్ మధ్య పోటీ నడిచింది. ఫలితంగా- లివింగ్‌స్టోన్ ప్రైస్ 10 కోట్ల రూపాయలు దాటింది. ఆ దశలో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ వెనకడుగు వేయలేదు. రేటును పెంచింది. పంజాబ్ కూడా తగ్గేదేలేదన్నట్లు వ్యవహరించింది. 10.50 కోట్లకు బిడ్ వేసింది. ఈ ప్రైస్‌ను సన్‌రైజర్స్ అందుకునే సాహసం చేయలేదు. దీనితో లియామ్ లివింగ్‌స్టోన్‌ను పంజాబ్ కింగ్స్ దక్కించుకోగలిగింది.

లివింగ్ స్టోన్.. కామన్..
నిజానికి- సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సూచించిన వారిలో లియామ్ లివింగ్‌స్టోన్ పేరు కామన్‌గా కనిపించింది. దాదాపు ఫ్యాన్స్ అందరూ లివింగ్‌స్టోన్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ సజెస్ట్ చేశారు. దీనికి అనుగుణంగా అతని కోసం సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్.. గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవి సక్సెస్ కాలేదు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ నుంచి గట్టిపోటీ ఎదురు కావడంతో తప్పుకోక తప్పలేదు. ఈ వ్యవహారం కాస్తా సన్‌రైజర్స్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఆగ్రహాన్ని తెప్పించింది.

పంజాబ్ కింగ్స్.. విలన్
లివింగ్‌స్టోన్‌కు ఏ ఆర్డర్‌లోనైనా ఆడే సామర్థ్యం ఉందని, అతన్ని వదులుకుని సన్‌రైజర్స్ తప్పు చేసిందంటూ విమర్శిస్తోన్నారు. ఎయిడెన్ మార్క్‌రమ్‌కు తోడుగా లివింగ్‌స్టోన్ ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండేదని అంచనా వేస్తోన్నారు. ఓ మంచి అవకాశాన్ని పోగొట్టుకుందని స్పష్టం చేస్తోన్నారు. అదే సమయంలో ఓడియన్ స్మిత్‌ను కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకోలేకపోయింది. ఇక్కడా పంజాబ్ కింగ్స్ అడ్డు పడింది. ఓడియన్ స్మిత్‌ను పంజాబ్ కింగ్స్ ఆరు కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.

అన్‌సోల్డ్ ప్లేయర్లుగా..
ఆశ్యర్యకరంగా ఇవాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్, డేవిడ్ మలన్, ల్యాంబూషేన్, చేతేశ్వర్ పుజారా, జేమ్స్ నీషమ్, అన్‌సోల్డ్‌గా మిగిలారు. సెకెండ్ రౌండ్ బిడ్డింగ్ సందర్భంగా వారిని బేస్ ప్రైస్‌లో మళ్లీ ఏ ఫ్రాంఛైజీ అయినా కొనుగోలు చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే సురేష్ రైనా, డేవిడ్ మిల్లర్, మాథ్యూవేడ్ వంటి టాప్ క్లాస్ ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications