IPL 2022: అందుకు మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది.. నేను నాల్గో స్థానంలోనే ఆడుతా

సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఈ విజయంపై గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. జట్టు విజయంలో అందరి పాత్ర ఉందని చెప్పాడు. ముఖ్యంగా మహ్మద్ షమీ, రాహుల్ తెవాటియా విజయంలో కీలకపాత్ర పోషించారని కొనియాడిన హార్దిక్.. అతని సోదరు కృనాల్ పాండ్యా తనను ఔట్ చేయడంపై కూడా వ్యాఖ్యానించాడు.

అందుకు మా ఫ్యామిలీ హ్యాపీ
ఈ మ్యాచ్‌లో తన అన్న కృనాల్ పాండ్యా తనను ఔట్ చేశాడని, తానెమో మ్యాచ్ గెలిచానని అందుకే ప్రస్తుతం తమ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉందని హార్దిక్ పాండ్యా చమత్కారంగా సమాధానమిచ్చాడు. ఒక వేళ తమ టీం గెలవకపోయి ఉంటే కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటైనందుకు బాధపడేవాడినని చెప్పాడు. కాగా ఈ మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యాను కృనాల్ పాండ్యా ఔట్ చేశాడు. అయితే లక్నోసూపర్ జెయింట్స్‌పై హర్దిక్ పాండ్యా టీం గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆ క్రెడిట్ అందరిది
ఇక ఈ విజయంతో తాము చాలా నేర్చుకున్నట్లు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. ఎవరో ఒకరిపై ఆధారపడకుండా జట్టుగా ఆడి విజయం సాధించాలని అనుకున్నామని, అదే చేశామని తెలిపాడు. ఈ విజయం క్రెడిట్ ప్రతి ఒక్కరికి దక్కుతుందని అన్నాడు. అలాగే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ షమీ, రాహుల్ తెవాటియాపై పాండ్యా ప్రశంసలు కురిపించాడు. షమీ తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు శుభారంభాన్ని అందించాడని కొనియాడాడు.
ఇక మనోహర్ రూపంలో తమకు మంచి ఆటగాడు దొరికాడని, అతను టీంకు భవిష్యత్ ఆశాకిరణం అని చెప్పుకొచ్చాడు. అలాగే రాహుల్ తెవాటియా ఒక సంచలనం అని చెప్పిన హార్దిక్.. అతని గురించి అందరికీ తెలుసని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అన్నాడు. అలాగే ఐపీఎల్‌లో తాను నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నట్లు హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.

గుజరాత్ విజయం
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమీ చెలరేగాడు. ఆరంభంలోనే వరుసగా కీలక వికెట్లు తీసి గుజరాత్‌కు శుభారంభాన్ని అందించాడు. అంతేకాకుండా 3 వికెట్లు తీసిన మహ్మద్ షమీనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
ఇక మిడిలార్డర్‌లో అజేయంగా 40 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ తెవాటియా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లు దీపక్ హుడా, బదోని హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్యాన్ని గుజరాత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చేధంచి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications