Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొత్త జెర్సీ వ‌చ్చేసింది.. వీడియో వైర‌ల్‌

IPL 2022: Kolkata Knight Riders unveil new jersey for IPL 15

కోల్‌క‌తా: ఐపీఎల్ 2022 కోసం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌న నూత‌న జెర్సీని ఆవిష్క‌రించింది. దీనికి సంబంధించిన 45 సెక‌న్ల‌ వీడియోను కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఆ జ‌ట్టు కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ వాయిస్ ఓవ‌ర్‌తో కూడిన ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. జెర్సీలోని బంగారు రంగు డిజైన్లు ఆక‌ట్టుకుంటున్నాయి. అలాగే కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ రంగు బ్లూ క‌ల‌ర్‌లో జెర్సీ ఉంది. కాగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ నూత‌న జెర్సీ ప‌ట్ల అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. "ఇవి అభిరుచితో పుట్టిన దారాలు. అదే అభిరుచి దానిని ధరించేవారిని నడిపిస్తుంది. కొత్త సవాళ్లను జయించటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది నైట్స్, ట్రైల్‌బ్లేజర్‌ల యూనిఫాం, స్టార్‌గేజర్స్, గేమ్ ఛేంజర్స్. ఇప్పుడు ప్రకాశించే సమయం వచ్చింది." అని అయ్యర్ స‌ద‌రు వీడియోలో పేర్కొన్నాడు.

కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్ ఐపీఎల్‌లో తన తొలి మ్యాచ్‌ను మార్చి 26న చెన్నైసూప‌ర్ కింగ్స్‌తో ఆడ‌నుంది. 30న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో, ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్‌తో, ఏప్రిల్ 6న ముంబై ఇండియ‌న్స్‌తో, ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో, 15న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో, 18న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో, 23న గుజ‌రాత్ టైటాన్స్‌తో, 28న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో, మే 2న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో, 7న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో, 9న ముంబై ఇండియ‌న్స్‌తో, 14న సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో, 18న ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పూర్తి జ‌ట్టు
ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), పాట్ కమిన్స్, నితీష్ రాణా, శివమ్ మావి, షెల్డన్ జాక్సన్, అజింక్య రహానే, రింకు సింగ్, అనుకుల్ రాయ్, రసిఖ్ దార్జిత్, అష్బా కరుణరత్నే, అష్బా కరుణరత్నే, అష్బా కరుణరత్నే , ప్రథమ్ సింగ్, అభిజీత్ తోమర్, సామ్ బిల్లింగ్స్, అలెక్స్ హేల్స్, రమేష్ కుమార్, మహమ్మద్ నబీ, అమన్ ఖాన్, ఉమేష్ యాదవ్

Story first published: Friday, March 18, 2022, 14:19 [IST]
Other articles published on Mar 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+