For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RR Playing 11: శ్రేయాస్ అయ్యర్ తలరాత ఏంటో: నైట్‌రైడర్స్‌కు చావో రేవో..

IPL 2022, Kolkata Knight Riders Playing 11 vs RR team predictions: here the all details

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవ్వాళ రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత నైట్‌రైడర్స్ బరిలోకి దిగబోతున్నాయి. ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్.. కోల్‌కత నైట్‌రైడర్స్ అత్యంత కీలకం. గెలిచి తీరాల్సిన గేమ్ ఇది. టోర్నమెంట్‌లో చివరి వరకు నిలవాలీ అంటే రాజస్థాన్ రాయల్స్‌పై విజయఢంకా మోగించడం తప్ప మరో మార్గం లేదు. వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో ఘోరంగా ఓడింది శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని నైట్‌రైడర్స్.

డబుల్ హ్యాట్రిక్ కొడుతుందా?

డబుల్ హ్యాట్రిక్ కొడుతుందా?

ఇందులోనూ ఓడితే పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్టవుతుంది. ఈ సీజన్‌లో నైట్‌రైడర్స్ గెలిచింది మూడు మ్యాచ్‌లే. ఆరింట్లో ఓడింది. చివరి అయిదు మ్యాచ్‌లల్లో అపజయాలనే చవి చూసింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మరింత పతనం కావడం ఖాయం. ప్లేఆఫ్స్ అవకాశాలను పోగొట్టుకున్నట్టే కనిపిస్తోంది. రాజస్థాన్ తరువాత.. లక్నో సూపర్ జెయింట్స్‌తో రెండు, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఒక్కొక్క మ్యాచ్‌ను ఆడుతుంది.

బ్యాటర్ల నిలకడలేమి..

బ్యాటర్ల నిలకడలేమి..

ఓపెనింగ్ భాగస్వామ్యం జట్టును వేధిస్తోంది. బ్యాటింగ్ తురుఫుముక్క వెంకటేష్ అయ్యర్ రాణించట్లేదు. శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా సైతం భారీ స్కోర్‌ను నిలకడగా సాధించట్లేదు. బ్యాటింగ్ ఆర్డర్ చూడ్డానికి బలంగా ఉన్నా ఫీల్డ్‌లో దిగేటప్పటికి పేకమేడే అవుతోంది. ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ పరుగులు చేయట్లేదు. బ్యాటింగ్ భారాన్ని కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మోస్తున్నాడు. నితీష్ రాణా ఫర్వాలేదనిపించుకుంటున్నాడు. వీరిలో ఏ ఒక్కర్ని కూడా తుదిజట్టు నుంచి తప్పించలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది కోల్‌కత.

గత సీజన్‌లాగే..

గత సీజన్‌లాగే..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా సాగిన గత సీజన్‌లోనూ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంది కోల్‌కత నైట్‌రైడర్స్. ఒకదశలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ తరువాత అనూహ్యంగా పుంజుకొంది. ఫైనల్స్ వరకు వెళ్లగలిగింది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆ చరిత్రను పునరావృతం చేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది శ్రేయాస్ టీమ్. ఇక మీదట అన్ని మ్యాచ్‌లను భారీ రన్‌రేట్‌తో గెలవగలిగితే ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది.

బ్యాటింగ్ భారం జోష్ మీదే..

బ్యాటింగ్ భారం జోష్ మీదే..

రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు కూడా నిలకడగా ఆడట్లేదు. ఓపెనర్ జోష్ బట్లర్ మీదే బ్యాటింగ్ భారం పడింది. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రోన్ హెట్మెయిర్.. అడపాదడపా సత్తా చాటుతున్నారు. వారి బ్యాటింగ్‌లో నిలకడ ఉండట్లేదు. ముంబై ఇండియన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఒక్కడే 60కి పైగా పరుగులు చేశాడు. మిగిలిన వారెవరూ రాణించలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి.. తన ఆటతీరును మళ్లీ గాడిన పెట్టాలని భావిస్తోంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉందీ జట్టు.

తుదిజట్టులో..

తుదిజట్టులో..

కోల్‌కత నైట్‌రైడర్స్ తుదిజట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వెంకటేష్ అయ్యర్, ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), నితీష్ రాణా, సునీల్ నరైన్, బాబా ఇంద్రజిత్ (వికెట్ కీపర్), పాట్ కమ్మిన్స్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా చోటు దక్కించుకునే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్‌ తుదిజట్టులో- జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కేప్టెన్-వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయిర్, డెరిల్ మిఛెల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్‌బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేందర్ చాహల్, కుల్‌దీప్ సేన్ ఆడొచ్చు.

Story first published: Monday, May 2, 2022, 7:24 [IST]
Other articles published on May 2, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+