
అతడితో కలిసి ఆడడం అదృష్టం
తాను క్రికెట్ ఆడే రోజుల్లో ఉమేష్ యాదవ్‌తో కలిసి ఆడడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కోల్‌కతా నైట్ రైడర్స్ హెడ్‌కోచ్ మెక్‌కలమ్ చెప్పాడు. అతనొక అద్భుతమైన బౌలర్ అని కొనియాడాడు. ఉమేష్ యాదవ్‌కు ఎంత నైపుణ్యం ఉందో, కొత్త బంతి సహకరిస్తే ఎలా చెలరేగుతాడో తనకు తెలుసని చెప్పుకొచ్చాడు. జట్టు కోసం ఉమేష్ యాదవ్ వీలైనన్నీ ఎక్కువ వికెట్లు తీయడానికి ప్రయత్నిస్తాడని తెలిపాడు. ఒక వేళ ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు వచ్చిన తాము పట్టించుకోమని, అతని నుంచి అటాకింగ్ బౌలింగే ఆశిస్తున్నట్లు మెక్‌కలమ్ చెప్పాడు.

ఆశించిన దానికంటే ఎక్కువగా రాణించాడు
ఇక ఇప్పటివరకు ముగిసిన రెండు మ్యాచ్‌ల్లో ఉమేష్ యాదవ్ తాము ఆశించిన దానికంటే ఎక్కువగా రాణించాడని మెక్‌కలమ్ తెలిపాడు. ప్రస్తుతం ఉమేష్ యాదవ్ కెరీర్ చరమాంకంలో ఉందని, అయినప్పటికీ 34 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ఉన్నాడని చెప్పాడు. ఉమేష్ యాదవ్ తమ జట్టుకు అతి పెద్ద బలం అని చెప్పిన ఆయన ఇప్పటికీ వికెట్లు తీయాలనే కసితో ఉన్నాడని కోల్‌కతానైట్ రైడర్స్ హెడ్‌కోచ్ మెక్‌కలమ్ తెలిపాడు.

ఉమేష్ యాదవ్ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 123 మ్యాచ్‌లాడిన ఉమేష్ యాదవ్ 123 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 4/24గా ఉన్నాయి. ఇక భారత జట్టు తరఫున 52 టెస్టుల్లో 158 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 7 టీ20ల్లో 9 వికెట్లు తీశాడు.

కేకేఆర్ ఓటమి
ఇక ఐపీఎల్‌లో బుధవారం జరిగిన మ్యాచ్ విషయానికొస్తే లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌కతానైట్ రైడర్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 128 పరుగులకే ఆటౌటైంది. 129 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేధించి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ మొత్తంలో ఇరు జట్లలోని ఏ ఒక్క ఆటగాడు కూడా కనీసం 30 పరుగుల మార్క్‌ను అందుకోకపోవడం గమనార్హం. మొత్తంగా బౌలర్లు అధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో 4 వికెట్లతో చెలరేగిన ఆర్సీబీ స్పిన్నర్ హసరంగకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


Click it and Unblock the Notifications












