IPL 2022: పవర్‌ప్లేలో ఉమేష్ యాదవ్ అదుర్స్.. బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్న కేకేఆర్ బౌలర్

పుణే: ఐపీఎల్ 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ ఉమేష్‌యాదవ్ చెలరేగుతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంత సూపర్ ఫామ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. కరెక్టు లైన్ అండ్ లెంగ్త్‌తో బాల్స్ వేస్తూ పవర్‌ప్లేలో కీలక వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను దెబ్బకొడుతున్నాడు.
రోహిత్ ఔట్
ఇక తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ప్లేలో ఉమేష్ యాదవ్ మరోసారి సత్తా చాటాడు. పవర్‌ప్లేలోనే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ తీసి ఆ జట్టును దారుణంగా దెబ్బకొట్టాడు. ముందు నుంచి హిట్‌మ్యాన్‌ను ముప్పతిప్పలు పెట్టిన ఉమేష్ యాదవ్.. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఐదో బంతనికి షార్ట్ పిచ్ బాల్ వేశాడు. అది భారీ షాట్ ఆడే క్రమంలో రోహిత్ బంతిని ఆకాశంలోకి కొట్టాడు.
కానీ అది మిస్సై అక్కడే భారీ ఎత్తుకు ఎగిరింది. దీంతో ఆ బంతిని వికెట్ కీపర్ బిల్లింగ్స్ అందుకున్నాడు. ఉమేష్ యాదవ్ దెబ్బకు ఈ మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కాగా ఐపీఎల్‌లో రోహిత్ శర్మను ఉమేష్ యాదవ్ ఔట్ చేయడం ఇది ఐదో సారి. ఉమేష్ యాదవ్ కట్టడి చేయడంతో ముంబై ఇండియన్స్ పవర్‌ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు మాత్రమే చేసింది.

పవర్‌ప్లేలో ఉమేష్ అదుర్స్
ఐపీఎల్ 2022లో పవర్‌ప్లేలో ఉమేష్ యాదవ్ చెలరేగుతున్నాడు. ఈ లీగ్‌లో ఉమేష్ యాదవ్ ఇప్పటివరకు 9 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా ఉండగా.. అందులో పవర్‌ప్లేలోనే 6 వికెట్లు తీయడం గమనార్హం. పవర్‌ప్లేలో వికెట్లు తీయడమే కాకుండా పరుగులు రాకుండా కట్టడి చేస్తున్నాడు. దీంతో పవర్‌ప్లేలోనే ఉమేష్ యాదవ్ కోల్‌కతాను విజయానికి చేరువ చేస్తున్నాడని చెప్పుకోవాలి. కాగా మెగా వేలంలో ఉమేష్ యాదవ్ రెండు సార్లు అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగలగా.. మూడోసారి 2 కోట్ల రూపాయల కనీస ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

తడబడుతున్న ముంబై
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ తడబడుతుననంది. 8 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. రోహిత్ 3, డెవాల్డ్ బ్రెవిస్ 29 పరుగులు చేశారు. ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.

తుది జట్లు
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, పాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, రసిఖ్ సలామ్, వరుణ్ చక్రవర్తి
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications