
న్యూజిలాండ్: ఐపీఎల్ 2022కు ముందు పలువురు స్టార్ క్రికెటర్లు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. వివాహం అనంతరం నేరుగా ఐపీఎల్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెయిన్ మాక్స్‌వెల్, భారత్‌కు చెందిన యువతిని వివాహం చేసుకుని కొత్త జీవితం ఆరంభించగా.. తాజాగా ఈ జాబితాలో న్యూజిలాండ్ సీనియర్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ కూడా చేరాడు. తాజాగా టిమ్ సౌథీ తన ప్రియురాలు బ్రయా ఫహీనిని వివాహం చేసుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సౌథీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి. సౌథీ జంటకు క్రికెటర్లతోపాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా సౌథీ, బ్రయా చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. అంతేకాకుండా ఇద్దరు సహజీవనంలో ఉన్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. పిల్లల పేర్లు ఇండీ మే సౌథీ, స్లోయానే అవా సౌథీగా ఉన్నాయి. మొత్తానికి ప్రియురాలితో ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాక సౌథీ పెళ్లి పీటలెక్కాడు. దీంతో పిల్లలు పుట్టాక పెళ్లి చూసుకున్న అతి కొద్ది మంది జాబితాలో టిమ్ సౌథీ కూడా చేరాడు. కాగా ఐపీఎల్ 2022లో సౌథీ కోల్‌కతానైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. మెగా వేలంలో సౌథీని కేకేఆర్ 1.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో గతంలో సౌథీ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున ఆడాడు. కాగా ఐపీఎల్ 2022 ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోతుంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ తలపడున్నాయి.
ఐపీఎల్‌లో ఇప్పవరకు 43 మ్యాచ్‌లాడిన సౌథీ 31 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 3/24గా ఉన్నాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 85 టెస్టు మ్యాచ్‌ల్లో 338 వికెట్లు, 143 వన్డేల్లో 190 వికెట్లు, 91 టీ20ల్లో 111 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అత్యుత్తమ గణాంకాలు 7/64 కాగా, వన్డేల్లో 7/33గా, టీ20ల్లో 5/18గా ఉన్నాయి.