
వాంఖడే: ఐపీఎల్ 2022లో ఫస్ట్ పంచ్ కోల్‌కతానైడ్ రైడర్స్‌దే అయింది. చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బౌలింగ్‌లో సీఎస్కేను భారీ స్కోర్ చేయనీయకుండా కట్టడి చేసిన కేకేఆర్..అనంతరం లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. బ్యాటింగ్‌లో ధోని, బౌలింగ్‌లో బ్రావో పోరాడినప్పటికీ సీఎస్కేను ఓటమి నుంచి కాపాడలేకపోయారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైసూపర్ కింగ్స్.. కోల్‌కతా బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. ఓ దశలో 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోని అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి కెప్టెన్ రవీంద్ర జడేజా కూడా సహకరించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధోని 50 పరుగులతో, జడేజా 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మిగతా వారిలో ఊతప్ప 28, రాయుడు 15, కాన్వే 3, దూబే 3 పరుగులు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయ్యాడు. కేకేఆర్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీశారు.
అనంతరం చెన్నైసూపర్ కింగ్స్ విసిరిన 132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఓపెనర్లు అజింక్యా రహానే, వెంకటేశ్ అయ్యర్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 16 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్.. బ్రావో వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో నితీష్ రానాతో కలిసి రహానే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే 10 ఓవర్లో మరోసారి చెలరేగిన బ్రావో 21పరుగులు చేసిన నితీష్ రానాను ఫెమిలియన్‌కు పంపాడు. అతను రాయుడుకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ కాసేపటికే 44 పరుగులు చేసిన రహానే.. సాంట్నర్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 34 బంతులు ఎదుర్కొన్న రహానే 6 ఫోర్లు, ఒక సిక్సు బాదాడు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత తనలోని పాత ఆటగాడిని బయటికి తీసి మంచి స్కోర్ చేశాడు.
అనంతరం జట్టు స్కోర్ 123 పరుగుల వద్ద ఉండగా మరో సారి చెలరేగిన బ్రావో 25 పరుగులు చేసిన సామ్ బిల్లింగ్స్‌ను ఫెమిలిన్ పంపాడు. అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. దీంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 20, షెల్డన్ జాక్సన్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. సీఎస్కే బౌలర్లో బ్రావో 3, శాంట్నర్ ఒక వికెట్ తీశారు.