సునీల్ నరైన్ విధ్వంసం
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో భాగంగా సోకా కింగ్, కోక్రికో కావలీర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ సోకా కింగ్ తరఫున బరిలోకి దిగాడు. ఓపెనర్‌గా ఆడిన నరైన్ పెను విధ్వంసం సృష్టించాడు. ఏకంగా రికార్డు స్థాయిలో 309 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అతని విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 3 ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న సునీల్ నరైన్ 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 22 బంతుల్లేనే 8 సిక్సులు బాది సిక్సర్ల వర్షం కురిపించాడని చెప్పుకోవాలి. ఇలా ఐపీఎల్‌కు ముందు సునీల్ నరైన్ సూపర్ ఫామ్‌లోకి రావడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ మెనేజ్‌మెంట్ ఫుల్ హ్యీపీగా ఉంది.

సోకా కింగ్ ఘన విజయం
సునీల్ నరైన్ విధ్వంసానికి తోడు జాసన్ మహమ్మద్ కూడా 33 బంతుల్లోనే 93 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 11 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. దీంతో 10 ఓవర్లలో సోకా కింగ్ ఒక వికెట్ నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు రన్‌రేట్ ఏకంగా 19.2గా నమోదైంది. అనంతరం 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోక్రికో కావలీర్స్ జట్టు ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు. నిర్ణీత 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్లు నష్టానికి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సునీల్ నరైన్‌కు చెందిన సోకా కింగ్ జట్టు 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

వేలానికి ముందే రిటైన్
ఐపీఎల్ మెగా వేలానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ సునీల్ నరైన్‌ను రిటైన్ చేసుకుంది. ఇందు కోసం నరైన్‌కు కోల్‌కతా 6 కోట్ల రూపాయలు చెల్లించింది. నరైన్‌తోపాటు మరో ముగ్గురు ఆటగాళ్లను కూడా కోల్‌కతా నరైన్ చేసుకుంది. వారిలో ఆండ్రీ రస్సూల్, వెంకటేష్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. ఇందుకుగాను రసూల్‌కు రూ.12 కోట్లు, వరుణ్ చక్రవర్తికి రూ.8 కోట్లు, వెంకటేష్ అయ్యర్‌కు రూ.8 కోట్లు చెల్లించనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ పూర్తి టీం
శ్రేయస్ అయ్యర్(12.25 కోట్లు), ఆండ్రీ రసెల్ (12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (8 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (8 కోట్లు) నితీశ్ రాణా ( 8 కోట్లు), శివమ్ మావి(7.25 కోట్లు), ప్యాట్ కమిన్స్(7.25 కోట్లు), ఉమేశ్ యాదవ్(2 కోట్లు), సామ్ బిల్లింగ్స్(2 కోట్లు), అలెక్స్ హేల్స్(1.50 కోట్లు), టిమ్ సౌథీ(1.50 కోట్లు), అజింక్య రహానె(కోటి), నబీ(కోటి), షెల్డన్ జాక్‌సన్(60 లక్షలు), రింకు సింగ్(55 లక్షలు), అశోక్ శర్మ( 55 లక్షలు), చమిక కరుణరత్నె(50 లక్షలు), అభిజిత్ తోమర్(40 లక్షలు), అమన్‌ఖాన్, అనుకుల్ రాయ్, ప్రతామ్ సింగ్, రసిఖ్ దార్, బాబా ఇంద్రజిత్(వీరందరికీ 20 లక్షలు).


Click it and Unblock the Notifications
