
రాహుల్ వర్సెస్ రషీద్
టీ20 ఫార్మాట్లో కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ తలపడిన మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్‌దే పై చేయిగా నిలిచింది. టీ20 ఫార్మాట్లో రషీద్ ఖాన్ వేసిన 30 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 18 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ స్ట్రైక్ రేట్ 60 మాత్రమే కాగా, సగటు కేవలం 6 గానే ఉంది. 14 బంతులు డాట్స్ కాగా రషీద్ ఖాన్ చేతిలో కేఎల్ రాహుల్ 3 సార్లు ఔటయ్యాడు. ఈ గణాంకాలను బట్టి కేఎల్ రాహుల్‌పై రషీద్ ఖాన్ పూర్తి అధిపత్యం చెలాయించడాని అర్థం చేసుకోవచ్చు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ కనీసం ఒక్క బౌండరీ కూడా బాదకపోవడం గమనార్హం. దీనిని బట్టి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రాహుల్‌కు ఎంత చెత్త రికార్డులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
రాహుల్ రాణించాలని కోరుకుంటున్న ఫ్యాన్స్
ప్రస్తుతం ఈ రికార్డులే లక్నో సూపర్ జెయింట్స్‌ను కంగారు పెడుతున్నాయి. ఎందుకంటే నేడు లక్నోసూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించగనుండగా.. రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో ఈ సారైనా రషీద్ ఖాన్‌ను కేఎల్ రాహుల్ సమర్ధవంతంగా ఎదుర్కోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే లక్నో జట్టులో రాహుల్ పాత్ర కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ కీలకంగా ఉంది.

రాహుల్, రషీద్ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 94 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ 47 సగటుతో 3273 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 76 మ్యాచ్‌లాడిన రషీద్ ఖాన్ 93 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 3/7 గా ఉన్నాయి. ఎకానమీ 6.33గా ఉండడం గమనార్హం.

తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, లూయిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినీస్, జేసన్ హోల్డర్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, కరణ్ శర్మ.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, మాథ్యూవేడ్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా/విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిశోర్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ.


Click it and Unblock the Notifications
