For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సొంత జట్టుపై ఫైర్ అయిన కేఎల్ రాహుల్.. స్టుపిడ్ క్రికెట్ ఆడారని మండిపాటు

IPL 2022: KL Rahul Unhappy With Lucknow Super Giants Middle Order

లక్నో సూపర్ జెయింట్స్ శుక్రవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు విజయాలు నమోదు చేసిన లక్నో.. పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20ఓవర్లకు 8వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. తర్వాత ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ 133పరుగులు మాత్రమే చేయగలిగింది.

తద్వారా 20పరుగుల తేడాతో లక్నో గెలుపొందింది. అయితే తొలుత లక్నో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచి స్కోరు దిశగా సాగుతున్న క్రమంలో లక్నో బ్యాటర్లు టపటపా ఔటయ్యారు. 12.2 ఓవర్లలో 98/2 స్కోరుతో లక్నో మంచి పొజిషన్లో ఉంది. తర్వాతి 19బంతుల్లోనే లక్నో 4వికెట్లు చేజార్చుకుంది. 111/6తో కష్టాల్లో పడింది. ఇక నూట ముప్ఫై అయిన స్కోరు చేస్తుందో లేదో అనుకునే సమయంలో దుష్మంత చమీర (17), జాసన్ హోల్డర్ (11), మొహ్సిన్ ఖాన్ (13) కాస్త పోరాడి 153పరుగుల వరకు చేర్చారు.

మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మ్యాచ్ అనంతరం జట్టు బ్యాటింగ్ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ వరుసగా ఔటవ్వడం స్టుపిడ్ క్రికెట్ అన్నాడు. జట్టులో అనుభవమున్న మిడిలార్డర్ ఉంది. అయినా ఇలా ఔటవ్వడం ఏం బాలేదని పేర్కొన్నాడు. ఇది కాస్త టఫ్ పిచ్ 160వరకు చేయగలిగితే కాస్త ఎడ్జ్ ఉంటుంది. కానీ కొన్ని చెడ్డ షాట్లు, రనౌట్ల వల్ల 160వరకు చేరుకోలేకపోయాం. అందుకే కాస్త అసంతృప్తి చెందానని తెలిపాడు. అయితే ఈ మ్యాచ్ మాత్రం పూర్తిగా బౌలర్లే ఆధిపత్యం చెలాయించారని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో లక్నో ప్లేయర్లు చమీర, మొహ్సిన్ మంచి ప్రదర్శన కనబరిచారు. చమీర నాలుగు ఓవర్లలో 2/17 ప్రదర్శన చేయగా.. మొహ్సిన్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇక వీరిద్దరి ప్రదర్శనపై రాహుల్ స్పందిస్తూ.. వారు చివర్లో 25-30 కీలక పరుగులు చేశారు. వారి బౌలింగ్ విధానం కూడా బాగుంది. తమ ప్రణాళికలను పరిపూర్ణంగా అమలు చేశారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో రాణించి జట్టును పటిష్ఠ స్థితికి తెచ్చారు. జట్టుగా మేము ఆడిన విధానం పట్ల సంతోషంగా ఉంది కానీ.. బ్యాటింగ్ యూనిట్ పట్ల నిరాశగా ఉన్నా. మేము మరింత మెరుగవ్వాలని భావిస్తున్నాను అని రాహుల్ పేర్కొన్నాడు.

Story first published: Saturday, April 30, 2022, 14:58 [IST]
Other articles published on Apr 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+