IPL 2022: GT vs LSG మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాను ఊరిస్తున్న రికార్డులు ఇవే!

ఐపీఎల్ 2022లో నేడు ఆసక్తిర పోరు జరగనుంది. కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ఇరు జట్లు విజయంతో ఐపీఎల్‌ను ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరు జట్లలోని ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పలు రికార్డులను అందుకోవడానికి చేరువలో ఉన్నారు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. మరి ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ఎంటో ఒక సారి పరిశీలిద్దాం.

హార్దిక్ పాండ్యా రికార్డులు
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరో రెండు సిక్సులు బాదితే ఐపీఎల్‌లో 100 సిక్సులు పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో 3 ఫోర్లు బాదితే 100 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు. ఐపీఎల్‌లో హార్దిక్ ఇప్పటివరకు 97 ఫోర్లు, 98 సిక్సులు బాదాడు. అలాగే మరో 24 పరుగులు చేస్తే 1500 పరుగులను కూడా పూర్తి చేసుకుంటాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లాడిన హార్దిక్ పాండ్యా 27 సగటుతో 1476 పరుగులు చేశాడు. నాలుగు సార్లు హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.. అత్యధిక స్కోర్ 91 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో పాండ్యా 98 సిక్సులు, 97 ఫోర్లు బాదాడు. అదే సమయంలో హార్దిక్ 42 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 3/20గా ఉన్నాయి.

కేఎల్ రాహుల్ రికార్డులు
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా రెండు రికార్డులకు చేరువలో ఉన్నాడు. మరో రెండు ఫోర్లు బాదితే టీ20 పార్మాట్‌లో రాహుల్ 500 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు. అలాగే మరొక హాఫ్ సెంచరీ పూర్తి చేస్తే టీ20 ఫార్మాట్లో రాహుల్ 50 హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకుంటాడు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు 94 మ్యాచ్‌లాడిన రాహుల్ 47 సగటుతో 3273 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 132 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో రాహుల్ 282 ఫోర్లు, 134 సిక్సులు బాదాడు.

2 వేల రన్స్‌కు చేరువలో మిల్లర్
గుజరాత్ టైటాన్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ మరో 26 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 2 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 89 మ్యాచ్‌లాడిన మిల్లర్ 32 సగటుతో 1974 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఈ క్రమంలో మిల్లర్ 137 ఫోర్లు, 90 సిక్సులు బాదాడు. ఇక మరో 2 వికెట్లు తీస్తే లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ షాబాజ్ నదీమ్ ఐపీఎల్‌లో 50 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. అలాగే మరో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ ఎవిన్ లూయిస్ 5 ఫోర్లు బాదితే టీ20 ఫార్మాట్లో 450 ఫోర్లను పూర్తి చేసుకుంటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications