
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ సెకెండ్ హాఫ్‌లోనూ కోల్‌కత నైట్‌రైడర్స్ పుంజుకోవట్లేదు. మరో మ్యాచ్‌లోనూ ఓడింది. ఈ టోర్నమెంట్‌లో వరుసగా అయిదో ఓటమి ఇది. ఆరంభంలో ఫర్వాలేదనిపించుకుంటూ వచ్చిన కేకేఆర్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా తయారైంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు తోడుగా నిలిచింది. గురువారం రాత్రి ముంబై వాంఖెడె స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది.
అరుదుగా చెప్పుకొనే గోల్డెన్ డక్స్ ఈ సీజన్‌లో తరచూ కనిపిస్తోన్నాయి. ఢిల్లీ కేపిటల్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మ్యాచ్‌లోనూ ఈ మ్యాచ్‌లో కూడా గోల్డెన్ డక్ రికార్డయింది. వరల్డ్ క్లాస్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే రెండుసార్లు తొలి బంతికే అవుట్ అయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌లల్లో అతను ఖాతా తెరవలేదు. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోహ్లీ ఎదుర్కొన్న గోల్డెన్ డక్స్ నమోదు చేశాడు. మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పైనా తొలి బంతికే అవుట్ అయ్యే ప్రమాదం ఏర్పడినప్పటికీ.. తృటిలోతప్పించుకున్నాడు.
ఈ సారి ఢిల్లీ కేపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా వంతు వచ్చింది. కోల్‌కత నైట్‌రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే వెనుదిరిగాడు. కోల్‌కత నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ కేపిటల్స్- పృథ్వీ షా రూపంలో ఇన్నింగ్ తొలిబంతికే వికెట్‌ను కోల్పోయింది. ఉమేష్ యాదవ్ వేసిన ఓవర్ అది. లెగ్ స్టంప్స్ మీదికి దూసుకొచ్చిన ఆ హాఫ్-వ్యాలీ బంతిని ఆన్‌సైడ్ ఫ్లిక్ చేయబోయాడు పృథ్వీ షా.

{ipl_headtohead_cricket_61_60}
కాస్త ఎర్లీగా బ్యాట్‌ను ఝుళిపించాడు. టైమింగ్ మిస్ కావడంతో బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. దీన్ని అద్భుతంగా అందుకున్నాడు ఉమేష్.. డైవ్ చేశాడు. నేలకు తాకుతుందనుకునే లోపే పట్టేశాడు. ఈ క్యాచ్‌ను పృథ్వీ షా నమ్మలేకపోయాడు. కొన్ని సెకెన్ల పాటు క్రీజ్‌లోనే ఉండిపోయాడు. నిరాశగా వెనుదిరిగాడు. అప్పటికి ఢిల్లీ కేపిటల్స్ స్కోర్ జీరో. ఆ ఒత్తిడిని కోల్‌కత బౌలర్లు కొనసాగించలేకపోయారు. డేవిడ్ వార్నర్, రౌమన్ పావెల్ చెలరేగడంతో గెలుపు.. ఢిల్లీ వశమైంది.