
ఓపెనర్లు శుభారంభం
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పటికీ క్రీజులో కుదురుకున్నాక వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 8.5 ఓవర్లలో తొలి వికెట్‌కు 64 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ ఔటయ్యాడు.

కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీ
ఆ తర్వాత రాహుల్ త్రిపాఠితో కలిసి కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 14వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి (17) గాయంతో రిటైర్డ్ హార్ట్ అయినప్పటికీ నికోలస్ పూరన్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో 17వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే 57 పరుగుల (46 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) వ్యక్తిగత స్కోర్ వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రాహుల్ తెవాటియాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి హైదరాబాద్ స్కోర్ 16.1 ఓవర్లలో 129-2 గా ఉంది.

సన్‌రైజర్స్ ఘనవిజయం
అనంతరం ఎయిడెన్ మాక్రమ్‌తో కలిసి మరో 5 బంతులు మిగిలి ఉండగానే సిక్స్ కొట్టి నికోలస్ పూరన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందించాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మాక్రమ్ కూడా 8 బంతుల్లో 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

గుజరాత్ 162-7
అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అంతా విఫలమైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (50) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. అభినవ్ మనోహర్ కూడా 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా వారలో మాథ్యువేడ్ 19, సాయి సుదర్శన్ 11, మిల్లర్ 12, గిల్ 7, రాహుల్ తెవాటియా 6 పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్ రెండేసి వికెట్లు, ఉమ్రాన్ మాలిక్, మార్కో జేనీసన్ తలో వికెట్ తీశారు.

స్కోర్లు
గుజరాత్ టైటాన్స్: 162-7
సన్‌రైజర్స్ హైదరాబాద్: 168-2


Click it and Unblock the Notifications












