IPL 2022: ఒకప్పుడు కాంట్రవర్సీ ప్లేయర్లు.. ఇప్పుడు సేమ్ జెర్సీ స్నేహితులు.. అశ్విన్, బట్లర్ వీడియో వైరల్

రవిచంద్రన్ అశ్విన్ వర్సెస్ జోస్ బట్లర్ మధ్య ఐపీఎల్ 2019లో జరిగిన కాంట్రవర్సీ ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే. నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉన్న బట్లర్‌ను అశ్విన్ మాన్కడింగ్ ద్వారా రనౌట్ చేయడంలో అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇక ఈ విషయంలో అశ్విన్, బట్లర్ మధ్య స్వల్ప వాదన కూడా జరిగింది. ఈ విషయంలో రవిచంద్రన్ కాస్త అపఖ్యాతి కూడా పాలయ్యాడు. ఇక ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ ఇద్దరు క్రికెటర్లు ఆడడంతో ఆనాటి వివాదాన్ని మరిచి ఒక్కటయ్యారు. ఇరువురు కూడా గ్రౌండ్లో, డగౌట్లో, డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా స్నేహపూర్వకంగా కన్పించారు. అశ్విన్ మరియు బట్లర్ కలిసి ప్రాక్టీస్ చేశారు. అశ్విన్ కొన్ని మ్యాచ్‌లలో 3వ స్థానంలో బరిలోకి దిగాడు. అప్పుడు బట్లర్‌తో కలిసి అశ్విన్ బ్యాటింగ్ కూడా చేశాడు. అప్పుడప్పుడు వీడియో ఇంటర్వ్యూలలో కూడా వీరిద్దరు కలిసి కనిపించారు. ఇక తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో వైరలైంది. తన ఆర్ఆర్ జెర్సీపై ఆటోగ్రాఫ్ కోరుతూ బట్లర్.. అశ్విన్‌ను ఈ వీడియోలో కోరాడు.

ఒకటి కాదు రెండు అవార్డులు
రాజస్థాన్ రాయల్స్ వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్టు చేసింది. 'థీస్ టూ' అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ట్వీట్ చేసింది. ఇక ఈ వీడియోలో బట్లర్ ఒకటి కాదు రెండు ఆర్ఆర్ జెర్సీలపై అశ్విన్ చేత ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత థాంక్యూ బ్రో అంటూ మురిసిపోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా బట్లర్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో రాణించినా.. సౌమ్యంగా ఉంటూ టీమ్ మేట్స్‌తో క్లోజ్‌గా ఉంటున్న జోస్ బట్లర్ నిజంగా జెంటిల్ మాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ సీజన్లో అరివీర భీకర ఫాంలో బట్లర్
ఇక ఈ సీజన్లో బట్లర్ అరివీర భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు అవార్డులతో ఐపీఎల్ 2022సీజన్లో అత్యధిక అవార్డులు పొందిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక ఈ ఏడాది టోర్నమెంట్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా బట్టర్ ఆరెంజ్ క్యాప్ కూడా పొందాడు. బట్లర్ 17మ్యాచ్‌లలో 57.53 సగటుతో మరియు 149.05 స్ట్రైక్ రేట్‌తో 863పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఒకే ఎడిషన్‌లో టోర్నీ చరిత్రలో ఒక బ్యాటర్ చేసిన రెండో అత్యధిక పరుగుల రికార్డు బట్లర్ పేరిట నమోదైంది. 2016 ఎడిషన్‌లో విరాట్ కోహ్లీ 973పరుగులు చేశాడు.
అశ్విన్ బ్యాటింగ్లో ఓకే.. బౌలింగ్లో నాట్ ఓకే
అలాగే ఈ ఐపీఎల్ రవిచంద్రన్ అశ్విన్ బానే రాణించాడు. అతను తన తొలి టీ20 హాఫ్ సెంచరీని నమోదు చేయడంతో సహా బ్యాటింగ్లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్లో మాత్రం అతను అనుకున్నంత రాణించలేదు. ఫైనల్‌తో సహా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లోనూ అశ్విన్ ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈ సీజన్‌లో 17గేమ్‌లలో కేవలం 12వికెట్లు మాత్రమే అశ్విన్ తీశాడు. అయినప్పటికీ అతని అనుభవం జట్టుకు ఉపయోగపడిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications