Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వేలంలో భారీ ధర వల్ల ఇషాన్ కిషన్‌కు ప్రెషర్‌ పెరిగిందా? అతని మాటల్లోనే..

 Ishan Kishan said that he was not affected by the price tag

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2022 సీజన్ ముంబై ఇండియన్స్‌కు పీడకలను మిగిల్చింది. ముంబై ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. 4పాయింట్లతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో స్థిరపడిపోయింది. ఇక ముంబై తన తర్వాతి మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌‌తో గురువారం తలపడనుంది. ప్లేఆఫ్‌ రేసు నుండి ఇప్పటికే ముంబై వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇక ఆ జట్టు మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచి ఈ సీజన్‌ను కాస్త గౌరవప్రదంగా ముగించాలని యోచిస్తోంది. ఈ సీజన్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జట్టులోని టాపార్డర్‌ రాణించలేదు. రోహిత్, ఇషాన్ కిషన్ ఇద్దరూ పెద్ద స్కోర్లు చేయడంలో ఇబ్బంది పడ్డారు. ఇక ఐపీఎల్ మెగా వేలంలో ఇషాన్‌ను రూ.15.25కోట్లకు ముంబై ఇండియన్స్ తిరిగి కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన కొనుగోలుగా ఇషాన్ కిషన్ నిలిచాడు. సీఎస్కేతోమ్యాచ్‌కు ముందు ఇషాన్ కిషన్ ప్రైస్ ట్యాగ్ వల్ల ఎదుర్కొంటున్న ప్రెషర్ గురించి తెలిపాడు.

జట్టుకు ఏం చేయాలనేదే ఇంపార్టెంట్

జట్టుకు ఏం చేయాలనేదే ఇంపార్టెంట్

'మెగా వేలం తర్వాత ఒకట్రెండు రోజులు అత్యధిక ధర పలికామన్న ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి ఉండడం సహజం. కానీ ప్రస్తుతం నేను ప్రైస్ ట్యాగ్ విషయాన్ని ఏమాత్రం దృష్టిలో ఉంచుకోవట్లేదు. మా జట్టు గెలవడానికి నేను ఏవిధంగా సహాయపడాలనే దానిపై మాత్రమే నేను దృష్టి పెడుతున్నా. ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి కచ్చితంగా కొన్ని రోజులు ఉంటుంది.. కానీ నా చుట్టూ మంచి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారని, వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి నాకు తగినంత మోటివేషన్ లభిస్తుంది' అని ఇషాన్ పేర్కొన్నాడు.

నీకంత ధర పెట్టాలని నువ్వేం కోరలేదుగా

నీకంత ధర పెట్టాలని నువ్వేం కోరలేదుగా

'నేను రోహిత్ భాయ్‌, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యాలతో మాట్లాడినప్పుడు, అందరూ నాతో ఒకటే చెప్పారు. నువ్వు నీ ప్రైస్ ట్యాగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే నీకంత ధర పెట్టాలని నువ్వేం టీంను కోరలేదు. టీమ్‌కి నీపై నమ్మకం ఉంది కాబట్టి వారు అంత డబ్బు పెట్టారు. డబ్బు కన్నా వారు నీ మీద ఉంచుకున్న నమ్మకమే ముఖ్యం' అని తనకు సూచించారని ఇషాన్ తెలిపాడు.

సీనియర్లతో మాట్లాడడం ఉపయోగపడింది

సీనియర్లతో మాట్లాడడం ఉపయోగపడింది

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇషాన్ కిషన్ 11ఇన్నింగ్స్‌లలో 321పరుగులు చేశాడు. అయితే అతని స్ట్రైక్ రేట్ 117.15తో చాలా పేలవంగా ఉంది. 'ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి గురించి ఆలోచించే బదులు, నా ఆట ఏంటో నా పరిధి ఏంటో దాని గురించే ఆలోచించడం ముఖ్యం. ఈ విషయంలో సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడటం నిజంగా సహాయపడింది. వారు చాలాకాలం పాటు క్రికెట్ ఆడుతున్నారు. విభిన్న పరిస్థితులను వారు ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో వాళ్లు వేలంలో వారికి పలికిన ధర వల్ల కొంత ఒత్తిడి ఎదుర్కొనే ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో వారు పరిస్థితిని ఎలా నిర్వహించారో వారి ద్వారా తెలుసుకున్నాను' అని ఇషాన్ తెలిపాడు.

Story first published: Wednesday, May 11, 2022, 16:42 [IST]
Other articles published on May 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+