Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2022లో చుక్కలు చూపించిన ప్లేయర్లు.. అత్యధిక సిక్సులు ఈ సీజన్లోనే

IPL 2022 is the Season with the highest number of sixes

ఐపీఎల్లో ఇప్పటివరకు 62 మ్యాచ్ లు ముగిశాయి. ప్రస్తుతం 63వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. ఇక ఈ ఐపీఎల్లో ప్లేయర్లు సిక్సర్ల హవా చూపిస్తున్నారు. ఇంకా 11మ్యాచ్‌లు మిగిలి ఉన్న క్రమంలో.. ఈ సీజన్లో ఇప్పటివరకు 875సిక్సులు నమోదయ్యాయి. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు నమోదైన సీజన్‌గా ఈ సీజన్ రికార్డులకెక్కింది. ఈ సీజన్లో ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బౌండరీలు వరదలా వచ్చాయి. ఇక అంతర్జాతీయ ప్లేయర్లతో పాటు దేశీయ ప్లేయర్లు సైతం సిక్సర్లతో విరుచుకుపడడమే ఈ సీజన్లో ఎక్కువ సిక్సులు రావడానికి కారణం.

టాప్ 5 అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్లు

టాప్ 5 అత్యధిక సిక్సర్లు నమోదైన సీజన్లు

ఇక ఈ సీజన్లో 62 మ్యాచ్‌లు ముగిసేసరికి 875సిక్సులు నమోదు అయ్యాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్లో మోయిన్ ఆలీ సిక్సు కొట్టడంతో 873సిక్సులు నమోదు కాగా.. అంతవరకు అత్యధిక సిక్సులు నమోదైన సీజన్ అయిన 2018సీజన్ (872సిక్సులు) రికార్డు బద్ధలయ్యింది. ఇక అత్యధిక సిక్సులు నమోదైన టాప్ 5 సీజన్లు ఇవే.

1. 2022 ఐపీఎల్ సీజన్లో 873*

2. 2018 ఐపీఎల్ సీజన్లో 872

3. 2019 ఐపీఎల్ సీజన్లో 784

4. 2020 ఐపీఎల్ సీజన్లో 734

5. 2012 ఐపీఎల్ సీజన్లో 731

ఈ సీజన్లో అత్యధిక సిక్సులు కొట్టిన టాప్ 5 ప్లేయర్లు

ఈ సీజన్లో అత్యధిక సిక్సులు కొట్టిన టాప్ 5 ప్లేయర్లు

ఈ సీజన్లో విదేశీ ప్లేయర్లు సిక్సర్ల మోత మోగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న జాస్ బట్లర్ ఈ సీజన్లో మూడు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతను అత్యధిక సిక్సులు కొట్టిన ప్లేయర్ల జాబితాలో 37సిక్సులతో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక టాప్ 5 ప్లేయర్లలో తొలి మూడు స్థానాల్లో విదేశీ ప్లేయర్లే ఉన్నారు.

1. జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్ ) - 37

2. ఆండ్రూ రస్సెల్ ( కోల్ కతా నైట్ రైడర్స్) - 32

3. లియమ్ లివింగ్ స్టోన్ (పంజాబ్ కింగ్స్) - 29

4. నితీష్ రానా (కోల్ కతా నైట్ రైడర్స్) - 22

5. దినేష్ కార్తీక్ ( రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ) - 21

62‌వ మ్యాచ్‌లో సాహా సూపర్ ఇన్నింగ్స్

62‌వ మ్యాచ్‌లో సాహా సూపర్ ఇన్నింగ్స్

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా 62వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. గుజరాత్ ఓపెనర్ సాహా చెలరేగి ఆడడంతో గుజరాత్ విజయాన్ని ఈజీగా అందుకుంది. సాహా (67పరుగులు 57 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్ నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి గుజరాత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో గెలుపు ద్వారా 20పాయింట్లకు చేరుకున్న గుజరాత్.. ప్లేఆఫ్ రేసులో టాప్ 2పొజిషన్లో ఒక జట్టుగా మారనుంది. దీంతో గుజరాత్ ప్లేఆఫ్స్ లో ఒక మ్యాచ్ ఓడినా కూడా ఫైనల్ చేరేందుకు మరో మ్యాచ్ అవకాశముంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది.

Story first published: Sunday, May 15, 2022, 21:08 [IST]
Other articles published on May 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+