Harbhajan's IPL playing 11: ఆల్ టైం ఐపీఎల్ ప్లేయింగ్ 11 ప్రకటించిన భజ్జీ... ధోనీ కెప్టెన్సీలో భీకర ప్లేయర్లు!

టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఐపీఎల్లో తన ఆల్ టైం ప్లేయింగ్ 11టీంని వెల్లడించాడు. హర్భజన్ 2008ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి 2017వరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి ఆడాడు. తరువాతి మూడు ఎడిషన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన భజ్జీకి అదే లాస్ట్ సీజన్. ఐపీఎల్లో 163మ్యాచ్‌లు ఆడిన భజ్జీ 150వికెట్లు తీశాడు. అలాగే 7.07ఎకానమీతో పొదుపైన బౌలింగ్ వేశాడు. తాజాగా హర్భజన్ ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ.. ఐపీఎల్లో తన ఆల్-టైమ్ ప్లేయింగ్ 11టీంను ప్రకటించాడు. ఆ టీంకు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా పేర్కొన్నాడు. ఈ టీం అరివీర భయంకరంగా ఉంది.

టాప్ ఆర్డర్లో వీరు
హర్భజన్ తాను ప్రకటించిన టీంలో క్రిస్‌గేల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా పేర్కొన్నాడు. ఐపీఎల్ చరిత్రలో వీరిద్దరు అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఉన్నారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీని మూడో స్థానంలో బరిలో దిగే ప్లేయర్‌గా పేర్కొన్నాడు. ఆసీస్ ఆల్‌రౌండర్‌గా, నాలుగుసార్లు ఐపీఎల్లో సెంచరీ చేసిన షేన్ వాట్సన్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే ప్లేయర్‌గా ప్రస్తావించాడు.

ఫినిషర్లుగా వీరు
ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఫినిషర్లుగా పేర్కొనే ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీలను అయిదు, ఆర స్థానాల్లో ఆడే ప్లేయర్లుగా పరిగణించాడు. ధోనీ వికెట్ కీపర్‌గానూ, కెప్టెన్‌గానూ ఈ టీంకు వ్యవహరిస్తాడు. ఇక ఆల్‌రౌండర్లు కీరన్ పొలార్డ్, రవీంద్ర జడేజా ఏడు, ఎనిమిదో స్థానాల్లో బరిలో దిగే ప్లేయర్లుగా అభివర్ణించాడు. పొలార్డ్ తన బౌలింగ్, బ్యాటింగ్ పదునుతో ముంబై జట్టుకు ఎన్నో విజయాలందించాడు. సీఎస్కేకు కెప్టెన్‌గా ఉన్న జడ్డూ సిసలైన ఆల్ రౌండర్‌గా పేరొందాడు.

బౌలర్లుగా వీరు
కేకేఆర్ ప్లేయర్ సునీల్ నరైన్ 9వ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ 10వ స్థానంలో.. పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా 11వ స్థానంలో ఆడే ప్లేయర్లుగా ప్రస్తావించాడు. ఐపీఎల్ 2020సీజన్ వరకు ముంబై ఇండియన్స్ బౌలింగ్ సెటప్‌లో మలింగ కీలక ప్లేయర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. మలింగ తర్వా బుమ్రా ప్రస్తుతం ముంబైకి స్థిరమైన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
హర్భజన్ సింగ్ ఆల్-టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ 11: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్& కెప్టెన్), రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications