For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ కేపిటల్స్ చేతిలో సన్‌రైజర్స్ జుట్టు: ఆర్సీబీ సహా ఈ 4 జట్లూ ఎలిమినేట్: కొత్త ఈక్వేషన్స్ ఇవీ

IPL 2022: If Delhi Capitals beat Mumbai Indians at their final league RCB, PBKS, KKR, SRH will be eliminated

ముంబై: ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్ ముంగిట్లో పంజాబ్ కింగ్స్ మరో పరాజయాన్ని చవి చూసింది. సీజన్ మొత్తంలో పడుతూ లేస్తూ వస్తోన్న ఈ టీమ్.. తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఒక గెలుపు- ఒక ఓటమి సీక్వెన్స్‌ను కంటిన్యూ చేస్తోంది. అంతకుముందు మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ను మట్టికరిపించిన పంజాబీయులు.. తాజాగా ఢిల్లీ కేపిటల్స్ చేతిలో దారుణంగా దెబ్బతిన్నారు. ఆర్సీబీపై 209 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ జట్టు- 160 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చతికిలపడింది.

ఢిల్లీ కీ రోల్..

ఢిల్లీ కీ రోల్..

రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ కేపిటల్స్ అద్భుతంగా ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. సోమవారం రాత్రి నాటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించడంతో మొత్తం సమీకరణాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఢిల్లీ కేపిటల్స్ వైపు మొగ్గు చూపాయి. సెకెండ్ హాఫ్‌ ప్రారంభానికి ముందు ఏడో స్థానానికి దిగజారిన ఈ జట్టు తాజాగా గెలుపుతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో తొలిసారిగా వరుసగా రెండు మ్యాచ్‌లల్లో నెగ్గింది. కీలకం అనుకున్న ప్రతీసారి విజయాన్ని అందుకుంది ఢిల్లీ కేపిటల్స్. ప్రస్తుతం 14 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇంకో మ్యాచ్ మిగిలేవుందా జట్టుకు.

ముంబైతో అమీ తుమీ..

ముంబైతో అమీ తుమీ..

ముంబై ఇండియన్స్‌తో తన చిట్టచివరి మ్యాచ్‌ను ఆడబోతోంది ఢిల్లీ కేపిటల్స్. ఈ శనివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ముంబై వాంఖెడె స్టేడియం దీనికి వేదిక. ఈ మ్యాచ్‌లో గనక ఢిల్లీ కేపిటల్స్ గెలిచిందీ అంటే.. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. అదే సమయంలో నాలుగు జట్లను నట్టేట ముంచి మరీ ఢిల్లీ కేపిటల్స్ ప్లేఆప్స్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఓడితే మాత్రం 14 పాయింట్ల వద్దే ఆ జట్టు ప్రస్థానం ఆగిపోతుంది. అదే స్థాయిలో ఉన్న మిగిలిన నాలుగు జట్ల మధ్య కొత్త సమీకరణాలకు తావిస్తుంది.

నాలుగు జట్లు జట్టు ఢిల్లీ చేతిలో..

నాలుగు జట్లు జట్టు ఢిల్లీ చేతిలో..

మొత్తంగా- నాలుగు జట్ల జుట్టు ఢిల్లీ కేపిటల్స్ చేతిలో చిక్కుకుంది. ముంబైపై గెలిస్తే 16 పాయింట్లను సాధించడమే దీనికి కారణం.సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో 10 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇవ్వాళ ముంబై ఇండియన్స్‌తో పాటు చివరి లీగ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిచినా దక్కేది మాత్రం 14 పాయింట్లే. 12 పాయింట్లతో ఉన్న కోల్‌కత నైట్‌రైడర్స్ తన చివరి లీగ్‌లో లక్నో సూపర్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ను కేకేఆర్ గెలిచినా 14 పాయింట్ల వద్ద ఆగిపోతుంది దాని ప్రస్థానం.

ఆర్సీబీ గెలిచినా.. రన్‌రేట్ కీలక పాత్ర..

ఆర్సీబీ గెలిచినా.. రన్‌రేట్ కీలక పాత్ర..

ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా తన చివరి లీగ్‌ను ఆడాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్‌‌పై ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఇందులో గెలిస్తే 16 పాయింట్లు ఆర్సీబీకి దక్కుతాయి. ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఢిల్లీ కేపిటల్స్‌తో సమానంగా నిలుస్తుంది. ఇక్కడ నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. మెరుగైన రన్‌రేట్ కారణంగా ఢిల్లీ కేపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశమే బలంగా ఉంది.

 పంజాబ్ కింగ్స్ కథ కూడా..

పంజాబ్ కింగ్స్ కథ కూడా..

పంజాబ్ కింగ్స్ కథ కూడా లీగ్ దశ వద్దే ముగిసిపోతుంది.. ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ కేపిటల్స్ గెలిస్తే. పంజాబ్ కింగ్స్ తన చివరి లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ ఓడితే- ఎలాంటి ఈక్వేషన్లతో అవసరం లేకుండా టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిస్తే మాత్రం మళ్లీ ఢిల్లీ కేపిటల్స్‌తో నెట్ రన్‌రేట్‌తో కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. పంజాబ్ కింగ్స్ ఖాతాలో ఉన్నవి 12 పాయింట్లు. సన్‌రైజర్స్ గెలిచి- 14 పాయింట్లు సాధించినా ప్లేఆఫ్స్ చేరడానికి అవి సరిపోవు.

Story first published: Tuesday, May 17, 2022, 9:08 [IST]
Other articles published on May 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+