IPL 2022: సీఎస్కేపై రికార్డు లక్ష్యాన్ని చేధించి లక్నో విజయం.. టాప్ 5 లక్ష్య చేధనలు ఇవే!

ఐపీఎల్ 2022లో గురువారం జరిగిన మ్యాచ్‌లో 200కు పైగా భారీ లక్ష్యాన్ని చేధించి చెన్నైసూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘనవిజయం సాధించింది. ఇరుజట్ల బ్యాటర్లు వీర విహారం చేసిన ఈ మ్యాచ్‌లో బౌలర్లు నామమాత్రంగా మారిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 210 పరుగులు చేస్తే.. 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో 3 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. కాగా ఓ జట్టు 200కు పైగా లక్ష్యాన్ని చేధించడం ఈ సీజన్లో ఇది రెండో సారి కావడం గమనార్హం. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోర్లను చేధించిన మ్యాచ్‌లను ఓ సారి పరిశీలిద్దాం.

టాప్‌లో రాజస్థాన్
ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్‌ను చేధించిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో ఉంది. 2020లో ఆ జట్టు ఏకంగా 224 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు బ్యాటర్ మయాంక్ అగర్వాల్ (106) సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ (69) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సంజూ శాంసన్ (85), రాహుల్ తెవాటియా (53), స్టీవెన్ స్మిత్ (50) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

రెండో స్థానంలో ముంబై
ఇక అత్యధిక స్కోర్లను చేధించిన జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది. 2021లో చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఏకంగా 219 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయం సాధించడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు (72), మొయిన్ అలీ (58), డుప్లిసెస్ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక ముంబై ఆ లక్ష్యాన్ని చేధించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కీరన్ పొలార్డ్ 87 పరుగులతో ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. 2008లో డెక్కన్ చార్జర్స్‌పై 215 పరుగుల లక్ష్యాన్ని చేధించి రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది.

నాల్గో స్థానంలో లక్నో
ఈ జాబితాలో లక్నో సూపర్ జెయింట్స్ నాల్గో స్థానంలో ఉంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు చెన్నైసూపర్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సీఎస్కే విసిరిన 211 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఆ జట్టు విజయంలో క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్ కీలకపాత్ర పోషించారు. ఇక ఈ జాబితాలో డెక్కన్ చార్జర్స్ ఐదో స్థానంలో ఉంది. 2017లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 209 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. కాగా టాప్ 5 లక్ష్య చేధనలో రాజస్థాన్ రాయల్స్ రెండు సార్లు ఉండడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications