కేన్ కేప్టెన్ కాకపోయుంటేనా.. ఈ పాటికి అస్సామే: ఇంకా ఓపెనర్‌గా ఎందుకంటే..

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవ్వాళ లైఫ్ అండ్ డెత్ గేమ్ ఆడబోతోంది. ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖెడె స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో పరాజయాలను చవి చూసిన పరిస్థితుల మధ్య.. ప్లేఆఫ్స్‌పై పూర్తిగా ఆశలను వదిలేసుకున్న దశలో ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది సన్‌రైజర్స్. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సి ఉంటుంది ఆరెంజ్ ఆర్మీకి.

డీలా పడ్డ సన్‌రైజర్స్

డీలా పడ్డ సన్‌రైజర్స్

ప్రస్తుతం అందరి దృష్టీ ఇవ్వాళ జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై నిలిచింది. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ ఓడినా, గెలిచినా పెద్దగా తేడా ఉండదు గానీ.. సన్‌రైజర్స్‌కు మాత్రం ఇది గెలిచి తీరాల్సిందే. ప్రస్తుతం 10 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్న ఈ జట్టు ముంబైపైనా ఓడితే ఇక ఇంటిదారి పట్టడమే మిగులుతుంది. చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఆడాల్సి ఉన్నా..అందులో గెలిచినా ఎలాంటి ఉపయోగం ఉండదు.

కేన్‌పై విమర్శల సునామీ..

కేన్‌పై విమర్శల సునామీ..

సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ కేన్ విలియమ్సన్ తాజాగా విమర్శలకు కేంద్రబిందువు అయ్యారు. సిరీస్ మొత్తం విఫలం అయ్యాడు. ఇతర కేప్టెన్లతో కంపేర్ చేసిన చూసినా కూడా వారికంటే లోయెస్ట్ స్కోర్, లోయెస్ట్ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. 12 మ్యాచ్‌లల్లో 208 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ స్ట్రైక్ రేట్.. 92.86. ఇంత లోయెస్ట్ స్ట్రైక్ రేట్ మరో కేప్టెన్‌కు లేదు. ప్రతి మ్యాచ్‌కు సగటున అతను చేసింది 18.91 పరుగులే. ఒక్క అర్ధసెంచరీ మాత్రమే అతను సాధించాడు. మరో 48 పరుగులు.

ఓపెనర్‌గా కూడా విఫలం..

ఓపెనర్‌గా కూడా విఫలం..

కేప్టెన్‌గా, బ్యాటర్‌గా, ఓపెనర్‌గా కూడా కేన్ విలియమ్సన్ ఫెయిలే. ఒక్కమ్యాచ్‌లోనూ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాడీ కివీస్ మాస్టర్ బ్లాస్టర్. కోల్‌కత నైట్‌రైడర్స్‌పై మరీ అధ్వాన్నంగా ఆడిన విషయం తెలిసిందే. తొమ్మిది పరుగులు చేయడానికి 17 బంతులు తీసుకున్నాడు. గేర్ మార్చే క్రమంలో వికెట్‌ను పారేసుకున్నాడు. 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఓపెనర్ బ్యాటర్ చేయాల్సిన పరుగులు కానే కావు అవి.

ఇంకా ఓపెనర్‌గానే..

ఇంకా ఓపెనర్‌గానే..

కేన్ విలియమ్సన్ వరుసగా డజను మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ.. అతణ్ని ఇన్నింగ్ ఓపెనర్‌గానే కొనసాగించడంపై సన్‌రైజర్స్ హెడ్ కోచ్ టామ్ మూడీ స్పందించారు. టిపికల్‌గా సమాధానం ఇచ్చారు. ప్లాన్లేవీ ఫలించనప్పుడు మార్పులు చేసి అనవసరం అనే రీతిలో బదులిచ్చారు. కేన్ విలియమ్సన్‌పై ఉన్న నమ్మకం సడలలేదని, అతను ఎప్పటికీ వరల్డ్ క్లాస్ బ్యాటరేనని కితాబిచ్చాడు. బ్యాటింగ్ తీరును తప్పుపట్టలేమని పేర్కొన్నారు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులుండవ్..

బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులుండవ్..

బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా ఎలాంటి మార్పులు గానీ, ప్రయోగాలు గానీ చేయదలచుకోలేదని టామ్ మూడీ స్పష్టం చేశారు. అభిషేక్ శర్మ-కేన్ విలియమ్సన్ ఓపెనింగ్ జోడీ కొనసాగుతుందనే సంకేతం ఇచ్చారు. వన్ డౌన్‌లో రాహుల్ త్రిపాఠి, నాలుగో స్థానంలో ఎయిడెన్ మార్క్‌రమ్, అతని తరువాత నికొలస్ పూరన్.. బ్యాటింగ్ ఆర్డర్ ఇలాగే కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఇది జట్టుకు కంఫర్టబుల్‌గా ఉంటోందని పేర్కొన్నాడు. తాము వేసుకున్న ప్లాన్స్ గ్రౌండ్‌లో ఫలించట్లేదని చెప్పుకొచ్చారు టామ్ మూడీ.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 17, 2022, 13:23 [IST]
Other articles published on May 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X