
బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా సాగుతుంది. వేలంలో భారీ ధర పలుకుతారని ఆశించిన పలువురు ఆటగాళ్లకు నిరాశజనక ధర రాగా.. పెదగా అంచనాల్లేని ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఈ క్రమంలో టీమిండియా యువ పేసర్ హర్షల్ పటేల్ మెగా వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయాడు. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన హర్షల్ పటేల్‌ను వేలంలో మళ్లీ ఆ జట్టే కొనుగోలు చేసింది. గతంలో హర్షల్ పటేల్‌కు 20 లక్షల రూపాయలు మాత్రమే వెచ్చించిన ఆర్సీబీ ఈ సారి వేలంలో మాత్రం 10 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో హర్షల్ పటేట్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏకంగా 10 కోట్ల 75 లక్షల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది.
హర్షట్ పటేల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ అతని ధర భారీగా పెరిగిపోవడంతో వదిలేసింది. దీంతో హర్షల్ పటేల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయిందని, పాపం కావ్య పాప అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక హర్షట్ పటేల్ ఈ వేలంతో కోటీశ్వరుడు అయిపోయాడని చెప్పుకోవాలి. గత సీజన్లో అతనికి కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే లభించగా ఈ సారి ఏకంగా అంతకంటే 10 కోట్ల 55 లక్షల రూపాయలు ఎక్కువగా లభించనుండడం గమనార్హం. అయితే హర్షట్ పటేల్ వేలంలో ఇంత భారీ ధర పలకడానికి అతను ప్రస్తుతం ఉన్న ఫామే కారణంగా చెప్పుకోవాలి. గత సీజన్లో హర్షల్ పటేల్ ఏకంగా 32 వికెట్లతో చెలరేగాడు. అంతేకాకుండా మొత్తం ఐపీఎల్ హిస్టరీలోనే ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇప్పటివరకు జరిగిన మెగా వేలంలో టీమిండియా యవ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. అతడిని 12 కోట్ల 25 లక్షల రూపాయల భారీ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఇక తర్వాత ఎక్కువ ధర పలికిన జాబితాలో హర్షల్ పటేలే ఉన్నాడు. అలాగే హెట్‌మయర్‌ను రాజస్థాన్ రాయల్స్ 8 కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.