For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: 6 బంతుల్లో 3 సిక్సులు.. సిక్సర్ల‌ ఛాలెంజ్‌లో కోహ్లీ, డుప్లిసెస్‌ను ఓడించిన హ‌ర్ష‌ల్ ప‌టేల్‌

IPL 2022: Harshal Patel defeated Virat Kohli and Faf Du plessis in the Sixers Challenge

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 మ‌రో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో జ‌ట్ల‌న్నీ ప్రాక్టీసులో మునిగి తేలాయి. ఈ క్ర‌మంలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కూడా తీవ్రంగా క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఈ క్ర‌మంలో ప్రాక్టీస్ సెష‌న్‌లో జ‌రిగిన సిక్స‌ర్ల పోటీలో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసెస్‌ను బౌల‌ర్‌ హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఓడించ‌డం ఆసక్తిగా మారింది.

కోహ్లీ, డుప్లిసెస్‌ను ఓడించిన హ‌ర్ష‌ల్‌

ప్రాక్టీస్ సెష‌న్‌లో భాగంగా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌల‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ మ‌ధ్య ప్రాక్టీస్ సెష‌న్‌లో సిక్సులు కొట్టే చాలెంజ్ న‌డిచింది. అయితే ఈ చాలెంజ్‌లో ఆశ్చ‌ర్య‌క‌రంగా బౌల‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ విజేత‌గా నిల‌వ‌డం గ‌మ‌నార్హం. మొత్తం 6 బంతులకు గాను హర్ష‌ల్ ప‌టేల్ 3 సిక్సులు కొట్టి ఫాఫ్ డుప్లిసెస్‌, విరాట్ కోహ్లీని ఓడించాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

కొత్త కెప్టెన్ అధ్వ‌ర్యంలో

కొత్త కెప్టెన్ అధ్వ‌ర్యంలో

ఇక ఈ సారి ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నూత‌న కెప్టెన్ అధ్వ‌ర్యంలో బ‌రిలోకి దిగ‌బోతుంది. గ‌తంలో ఆ జ‌ట్టును న‌డిపించిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డుప్లిసెస్‌కు ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. దీంతో ఈ సీజ‌న్లో ఆర్సీబీని డుప్లిసెస్ ఎలా న‌డిపిస్తాడ‌నే ఆస‌క్తి అంత‌టా నెల‌కొంది.

ముఖ్యంగా ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సారి కూడా ట్రోఫీ గెల‌వ‌లేక‌పోయిన ఆర్సీబీ నిరీక్ష‌ణ‌కు డుప్లిసెస్ తెర‌దించాల‌ని ఆ జ‌ట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్సీబీని డుప్లిసెస్ ఐపీఎల్ 2022 ట్రోఫీ విజేత‌గా నిల‌బెట్టాల‌ని ఆశిస్తున్నారు. కాగా ఐపీఎల్‌లో డుప్లిసెస్ ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడూ కెప్టెన్సీ చేయ‌క‌పోయిన‌ప్పటికీ అంత‌ర్జాతీయ క్రికెట్లో మాత్రం సౌతాఫ్రికా సార‌థిగా ప‌ని చేశాడు. ఆ జ‌ట్టుకు అనేక విజ‌యాలు అందించాడు.

ఆర్సీబీ పూర్తి జ‌ట్టు

ఆర్సీబీ పూర్తి జ‌ట్టు

విరాట్ కోహ్లీ (15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌తో (11 కోట్లు), మహమ్మద్ సిరాజ్ (7 కోట్లు), వానిందు హసరంగ (10.75 కోట్లు), హర్షల్‌ పటేల్ (10.75 కోట్లు), డుప్లెసిస్ ( 7 కోట్లు), దినేశ్‌ కార్తీక్ (5.5 కోట్లు), జోష్‌ హేజిల్ వుడ్ (7.75 కోట్లు), షాబాజ్‌ అహ్మద్ (2.4 కోట్లు), అనుజ్‌ రావత్ (3.4 కోట్లు), డేవిడ్‌ విల్లే ( 2 కోట్లు), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (కోటి) మహిపాల్‌ లామ్రోర్ (95 లక్షలు), ఫిన్‌ అలెన్ ( 80 లక్షలు), జేసన్‌ బెహ్‌రెండోర్ఫ్ ( 75 లక్షలు), సిద్ధార్థ్‌ కౌల్ (75 లక్షలు), కర్ణ్‌ శర్మ (50 లక్షలు), చామ మిలింద్ (25 లక్షలు), సుయాశ్‌ ప్రభుదేశాయ్ (30 లక్షలు), ఆకాశ్‌ దీప్‌, అనీశ్వర్‌ గౌతమ్‌, లువ్‌నిత్‌ సిసోడియా(వీరంద‌రికీ 20 లక్షలు).

Story first published: Thursday, March 24, 2022, 16:09 [IST]
Other articles published on Mar 24, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+