For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: వచ్చే ఏడాది గుజరాత్ టైటాన్స్ తరఫున పొలార్డ్ ఆడుతాడని చెప్పిన హార్దిక్.. కానీ?

IPL 2022: Hardik Pandya Wants Kieron Pollard To Play For Gujarat Titans Next year

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు గతంలో ఆడిన సంగతి తెలిసిందే. హార్దిక్ ముంబై ఇండియన్స్‌ జట్టులో ఏడు సీజన్ల పాటు ఆడాడు. ఈ క్రమంలో ముంబై జట్టు తరఫున 1476పరుగులు చేసిన హార్దిక్ 42వికెట్లు కూడా తీశాడు. అతను ముంబై జట్టు 4 టైటిళ్లు గెలుచుకున్న జట్టులో సభ్యుడు కూడా. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై జైత్రయాత్రలో హార్దిక్ సైతం కీలక పాత్ర పోషించాడు. శుక్రవారం హార్దిక్ తొలిసారిగా ముంబై జట్టుతో తలపడనుండడంతో ఈ మ్యాచ్ అతనికి స్పెషల్ కానుంది.

ఒక్క అడుగు దూరంలో గుజరాత్..

ఒక్క అడుగు దూరంలో గుజరాత్..

ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్‌లో తమ బెర్త్‌ను కన్ఫమ్ చేసుకోవడానికి గుజరాత్ జట్టు కేవలం అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇప్పటికే 10 మ్యాచ్‌లలో 8 మ్యాచ్‌లు గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక మరోవైపు ఆడిన 9మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే గెలిచిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను ముంబై ఇండియన్స్ చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

ఆ ఇన్నింగ్స్ వల్లే నాకు గుర్తింపు

ఇక ఈ మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌లో తన ప్రస్థానం గురించి, అనుభవాల గురించి గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. 2015 నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ వల్ల తనకు మంచి గుర్తింపు వచ్చిందని, అది తన ఫేట్ మార్చేసిందని గుర్తుచేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఇటీవల కీరన్ పొలార్డ్‌తో చాట్ చేశానని, అతనికి రిటైర్మెంట్ అభినందనలు తెలిపానని పేర్కొన్నాడు. అలాగే వచ్చే‌ ఏడాది తమ టీం తరఫున పొలార్డ్‌ ఆడతాడని సరదాగా హార్దిక్ పాండ్యా చెప్పాడు.

అది జరిగే పని కాదు

అది జరిగే పని కాదు

గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ బ్లూ జెర్సీలోనే ఆడుతున్నాను. ఈసారి నేను నా హోమ్ స్టేట్ టీం అయిన గుజరాత్ టైటాన్స్ తరఫున బ్లూ జెర్సీలో బరిలో దిగడం మరింత ప్రత్యేకం. ఇక అంతకుముందు ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పుడు ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలున్నాయి. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 2ఓవర్లలో 32పరుగులు అవసరమైన దశలో 3 సిక్సర్లు బాదడం ఇంకా మరిచిపోలేను. ఇంకా చాలా గుర్తులు ముంబై జట్టుతో నాకు ఉన్నాయి. ఇక నా ఫ్రెండ్ పొలార్డ్‌కు మంచి టైం రావాలని కోరుకుంటున్నా. కొన్ని రోజుల క్రితం నేను పొలార్డ్‌కు మెసేజ్ చేశాను. 'హోప్ యు ఆర్ ఓకే, హోప్ యు ఆర్ ఎంజాయ్ ఇట్' అని చెప్పాను. ఇంకా పొలార్డ్ నీకు తెలుసో లేదో వచ్చే ఏడాది మా గుజరాత్ టైటాన్స్ జట్టులోకి నువ్వు రాబోతున్నావ్ అన్నాను. పొలార్డ్ మా జట్టులోకి రావాలని నా కోరిక కానీ అది జరిగే విషయం కాదు.. ఎందుకంటే ముంబై పాలీని మిస్ చేసుకోదు అని నాకు తెలుసు' అని హార్దిక్ సరదాగా పేర్కొన్నాడు.

Story first published: Friday, May 6, 2022, 15:10 [IST]
Other articles published on May 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+