For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై ఇండియన్స్‌లో ఆ ఆల్‌రౌండర్‌కు ఎసరు: వదిలించుకోవడానికే..!

IPL 2022: Hardik Pandya unlikely to be retained by Mumbai Indians

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మరో రెండు కొత్త ఫ్రాంఛైజీలతో కళకళలాడనుంది. అహ్మదాబాద్, లక్నో పేర్లతో కొత్తగా రెండు జట్లు ఐపీఎల్ 2022లో ఆడబోతున్నాయి. దీనితో మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుంది. వాటి షెడ్యూల్ సుదీర్ఘంగా ఉంటుంది. కొత్త జట్లు రానున్న నేపథ్యంలో- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్లేయర్ల రిటెయిన్ పాలసీని మార్చడంపై దృష్టి సారించింది. ఫలితంగా- దాదాపు అన్ని జట్లల్లోనూ కొత్త ముఖాలు కనిపించడానికి అవకాశం ఏర్పడినట్టయింది.

 కొత్త రిటెన్షన్ పాలసీ

కొత్త రిటెన్షన్ పాలసీ

కొత్త రిటెయిన్ పాలసీ ప్రకారం మెగా ఆక్షన్‌ను నిర్వహించడానికి ముందే పాత జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వీలు లభించింది. ఈ నలుగురిలో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక ఓవర్సీస్ ప్లేయర్/ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు లేదా ఇద్దరు ఓవర్సీస్ క్రికెటర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రిటెన్షన్ పాలసీని నవంబర్ చివరివారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఆ మరుసటి నెలలోనే అంటే డిసెంబరులో మెగా ఆక్షన్ నిర్వహించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి

 ముంబైపై ఫోకస్..

ముంబైపై ఫోకస్..

ఈ రిటెన్షన్ పాలసీని బీసీసీఐ అందుబాటులోకి తెస్తుందనే వార్తలు రావడంతో.. ఏ జట్టు ఎవరిని వదిలించుకుంటుందనే విషయం మీద డిబేట్స్ ఆరంభం అయ్యాయి. అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచి.. ఈ సారి ప్లేఆఫ్స్‌కు కూడా వెళ్లని ముంబై ఇండియన్స్‌పై దృష్టి పడింది. రోహిత్ శర్మ కేప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ ఎవరిని కొనసాగిస్తుంది? ఎవరిని సాగనంపుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని అంచనాలు సైతం వ్యక్తమౌతున్నాయి.

 ఆల్‌రౌండర్ హోదాను కోల్పోతోన్న హార్దిక్

ఆల్‌రౌండర్ హోదాను కోల్పోతోన్న హార్దిక్

కొంతకాలంగా ఫామ్‌ను కోల్పోయిన ఆల్‌రౌండర్ రోహిత్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. అతణ్ని ఆక్షన్ కోసం వదిలేస్తుందని చెబుతున్నారు. ఆల్‌రౌండర్ గుర్తింపుతో ముంబై ఇండియన్స్ అతణ్ని జట్టులోకి తీసుకుంది. చాలా సంవత్సరాలుగా అతను ముంబై ఇండియన్స్ కోసం ఆడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆల్‌రౌండర్ హోదాను కోల్పోయాడు. బౌలింగ్ చేయట్లేదు. బ్యాటింగ్ మీదే ఆధారపడుతున్నాడు.

బౌలింగ్‌కు దూరం కావడంతో..

బౌలింగ్‌కు దూరం కావడంతో..

బౌలింగ్‌కు దూరం కావడం హార్దిక్ పాండ్యా కేరీర్‌ను దెబ్బతీసేలాగా కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఎంపికైన జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ.. అతనిపై ఎలాంటి అంచనాలు ఉండట్లేదు. బౌలింగ్ చేయకపోవడం వల్ల అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ కోసం అన్వేషిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. అదే పరిస్థితి ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ ఫ్రాంఛైజీలోనూ నెలకొంది. హార్దిక్ పాండ్యాను వదిలించుకుని.. మరో ఆల్‌రౌండర్‌ను టీమ్‌లోకి తీసుకోవడానికి ఫ్రాంఛైజీ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రెమ్యునరేషన్‌ కుదింపుపైనా

రెమ్యునరేషన్‌ కుదింపుపైనా

దేశీయ ప్లేయర్ల కోటాలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌, ఓవర్సీస్ ఆటగాళ్లలో కీరన్ పొలార్డ్‌ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యాలాగా సూర్యకుమార్ యాదవ్ గానీ, ఇషాన్ కిషన్ గానీ ఆల్‌రౌండర్లు కాదు. కీరన్ పొలార్డ్ ఈ హోదాలో కొనసాగుతాడు. జట్టులో హార్దిక్‌ను కొనసాగించాల్సిన పరిస్థితే ఎదురైతే.. అతనికి కేటాయించే బడ్జెట్ రెమ్యునరేషన్‌ను కుదించే అవకాశాలను కూడా ఫ్రాంఛైజీ ఓనర్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

Story first published: Friday, October 29, 2021, 10:53 [IST]
Other articles published on Oct 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+