For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Hardik Pandya: నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేయడం నా కల.. ఇక చెలరేగడమే

 hardik likes no 3 position

ఐపీఎల్ - 2022లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. జట్టులో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. మంచి ఇన్సింగ్స్‌లు ఆడుతూ గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాధ్యతాయుతమైన రీతిలో అతని ప్రదర్శన ఉంది. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ కాంటెండర్ లిస్టులో (అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే క్యాప్) నాలుగో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో 81.83సగటుతో 491పరుగులు చేసిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ బట్లర్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా హార్దిక్ పాండ్యా ఆడిన 6 మ్యాచ్‌లలో 73.75సగటుతో 295పరుగులు చేసి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నంబర్ 3స్థానంలో బరిలోకి దిగి 67పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ ఆడిన 7మ్యాచ్‌లలో ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి 12పాయింట్లో టేబుల్ టాపర్‌గా ఉంది.

తాజాగా నంబర్ 3స్థానంలో బ్యాటింగ్ దిగే విషయం గురించి హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నంబర్ 3స్థానంలో ఆడాలనేది నా డ్రీమ్. 2016లో ముంబై తరఫున ఆ స్థానంలో ఆడాను. కానీ అప్పుడు నా టైం బ్యాడ్ ఉంది. క్లిక్ కాలేదు. కానీ ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌లో నంబర్ 3స్థానంలో ఆడే వీలు చిక్కింది. ఇప్పుడు తప్పకుండా ఆ స్థానంలో నా ఆట ఎలా ఉంటుందో నిరూపించుకుంటాను. ' అని గుజరాత్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకితో జరిగిన సంభాషణలో పాండ్యా తెలిపాడు. అలాగే తన ఫామ్, ఆడే విధానం గురించి మాట్లాడుతూ.. 'ఫామ్ పరంగా.. నేను ప్రస్తుతం బాగా బ్యాటింగ్ చేస్తున్నా. అలాగే సరైన సమయంలో బ్యాటింగ్‌కు దిగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఒకవేళ ఓపెనర్ శుభమాన్ గిల్ తొందరగా ఔటయితే నా రోల్ కాస్త వేరే ఉంటుంది. శుభ్‌మాన్ క్రీజులోనే ఉంటే నా బ్యాటింగ్ కాస్త దూకుడుగా ఉంటుంది. శుభ్ మాన్ ఔటయ్యాక.. నేనే శుభ్‌ మాన్ గిల్‌ని అవుతాను.' అని పేర్కొన్నాడు.

 hardik likes no 3 position

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. 'నేను మంచి క్రికెట్ షాట్‌లు ఆడాను. రిస్క్ ఎక్కువ తీసుకోలేదు. మంచి రన్ రేట్ మెయింటెన్ అయ్యేలా చూసుకున్నాను. మొత్తంగా నేను నా బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను.' అని పాండ్యా తన ఇన్నింగ్స్ గురించి చెప్పాడు. గాయం వల్ల పాండ్యా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్ చేయలేదు. ఈ ఆల్ రౌండర్ మళ్లీ ఎప్పుడు బౌలింగ్‌ వేస్తాడో వేచిచూడాలి. గుజరాత్ టైటాన్స్ తన తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్ 27న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.

Story first published: Tuesday, April 26, 2022, 15:55 [IST]
Other articles published on Apr 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+