Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెదనాన్నకే తన సపోర్ట్ అంటూ లక్నో జెర్సీ వేసుకున్న హార్దిక్ పాండ్యా కొడుకు

IPL 2022: Hardik Pandyas son supporting Krunal Pandya ahead of LSG vs GT Match

ఐపీఎల్ - 2022లో నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆసక్తికర విషయమేంటంటే పాండ్యా సోదరులు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఈ సీజన్‌లో రెండోసారి తలపడుతుండడం. ఐపీఎల్ 2022 మెగావేలానికి ముందు హార్దిక్, కృనాల్ ఇద్దరూ 5సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌ టీంలో భాగంగా ఉన్నారు. ఇద్దరు ఎన్నో మ్యాచ్‌లలో ముంబైని గెలుపుతీరాలకు చేర్చారు. అయితే మెగావేలంలో వీరిద్దరిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్‌ జట్టు హార్దిక్‌ను రిటైన్ చేసుకుని కెప్టెన్సీ అప్పగించగా.. కృనాల్‌ పాండ్యాను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.

ఇక లక్నో వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌కు ముందు కృనాల్ పాండ్యా ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్ జెర్సీని ధరించిన హార్దిక్ పాండ్యా కుమారుడు అగస్త్య ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. జెర్సీ వెనుక అగస్త్య అని పేరు కూడా రాసి ఉండడం గమనార్హం. పెద్ద నాన్న వరుస అయ్యే కృనాల్ పాండ్యాకు పొట్టోడు అగస్త్య పాండ్యా సపోర్ట్ చేస్తున్నట్లు ఉంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ జెర్సీని అగస్త్యకు కృనాల్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటో షేర్ చేసిన కృనాల్.. నేటి మ్యాచ్‌లో నా లక్కీ ఛార్మ్ నా వైపు సపోర్ట్ ఇవ్వబోతున్నాడు అంటూ కృనాల్ పేర్కొన్నాడు. అంతకుముందు ఈ రెండు జట్లు ఈ సీజన్లో తలపడగా.. అప్పుడు హార్దిక్‌ను అవుట్ చేయడం ద్వారా కృనాల్ పైచేయి సాధించాడు. కానీ ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది.

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం జరగబోయే మ్యాచ్‌లో గుజరాత్, లక్నో జట్లు తొలి ఐపీఎల్ ప్లేఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక ఐపీఎల్ ఈ సీజన్లో మొదటి నుంచి గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా లక్నో గుజరాత్‌ను అధిగమించి నెట్ రన్‌రేట్ వల్ల అగ్రస్థానంలోకి చేరుకుంది. గత వారం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో వరుస పరాజయాలతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఇక ఇరు జట్లు ఆడిన 11మ్యాచ్‌లలో 8‌మ్యాచ్‌లు గెలిచి 16పాయింట్లతో కొనసాగుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 75పరుగుల భారీ తేడాతో గెలిచిన ఆత్మవిశ్వాసంతో లక్నో ఈ మ్యాచ్ ఫేవరెట్‌గా కన్పిస్తున్నప్పటికీ.. మ్యాచ్ విన్నర్లు ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు.

Story first published: Tuesday, May 10, 2022, 18:52 [IST]
Other articles published on May 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+