
కృనాలకు ముందే చెప్పా..
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే నా సోదరుడు కృనాల్ పాండ్యాతో మాట్లాడుతూ నా అత్యుత్తమ ఆటను వెలికితేసే సత్తా ఆశిష్ నెహ్రాకే ఉందని చెప్పా. ఆయనతో కలిసి ఆడటంతో పాటు, ఎక్కువసేపు గడుపుతుంటాను. అతని కంపెనీని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. క్రికెట్ గురించి మా ఇద్దరీ ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులలో నెహ్రా ఒకడు. ప్రతీ ఒక్కరికి కావాల్సినంత టైమ్ ఇస్తాడు. గుజరాత్ సక్సెస్ క్రెడిట్ నెహ్రాతో పాటు సపోర్ట్ స్టాఫ్కు ఇవ్వాలి. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని వీళ్లు ప్రశాంతంగా ఉంచేవారు.

ఫలితంతో సంబంధం లేకుండా..
నా కెప్టెన్సీ విషయానికి వస్తే.. జట్టులోని ఆటగాళ్లకు ఎవరీ బాధ్యతలపై వారికి క్లారిటీ ఉంది. జట్టు విజయం కోసం వారు చేయాల్సిందల్లా చేస్తున్నారు. దాంతో కెప్టెన్గా నా పని సులువవుతోంది. అయితే ఆటగాళ్లుగా మాపై మాకు నమ్మకం ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా అందరం ఇంట్లో ఉన్నామనే ఫీలింగ్తో ఉన్నప్పుడే జట్టుగా రాణించగలం. మనం ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా సరే.. మన పోరాటం మనం చేయాలి. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయత్నించాలి. టీమ్ కోసం ఎంత ఎఫెర్ట్ పెట్టారనే విషయాన్నే నేను లెక్కలోకి తీసుకుంటా.

రిగ్రేట్ అవుతున్నారనుకుంటా..
నా జీవితంలోని వైఫల్యాలను ప్రశ్నిస్తూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. మెగా వేలానికి ముందు నన్ను తీసుకోరని, రిటైన్ చేసుకోరని చాలా విమర్శలు చేశారు. అయితే వాటికి సమాధానం చెప్పడానికి ఇది సరైన మార్గం కాదనేది నా అభిప్రాయం. నా గురించి తప్పుగా మాట్లాడి, విమర్శలు చేసిన వారిని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోమని నేను కోరను. ఎందుకంటే ఇప్పటికే వారంతట వారే నాపై చేసి వ్యాఖ్యలకు పశ్చాతాపపడుతున్నారని భావిస్తున్నా'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.