Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త జట్ల మధ్య పోరాటం.. చూడ్డానికి ప్రేక్షకులంతా సిద్ధం: తుదిజట్టులో హెవీ వెయిట్స్

IPL 2022: Hardik Pandyas Gujarat Titans playing 11 against Lucknow Super Giants
IPL 2022 : GT vs LSG Match Preview, Playing XI

ముంబై: ఐపీఎల్‌లో ఇవ్వాళ రెండు కొత్త జట్లు- తమ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాయి. తొలిసారిగా తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా మారింది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లలోనూ హెవీ వెయిట్ ప్లేయర్లు ఉన్నారు. కిందటి సీజన్ దాకా వేర్వేరు ఫ్రాంఛైజీల్లో కనిపించిన ముఖాలన్నీ ఈ రెండింటి తరఫున గ్రౌండ్‌లో ప్రత్యక్షం కానున్నాయి. గెలుపుతో తమ ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించేది ఏ జట్టనేది.. ఈ రాత్రికి తేలిపోతుంది.

గుజరాత్ టైటాన్స్‌కు పాండ్యా సారథ్యం..

గుజరాత్ టైటాన్స్‌కు పాండ్యా సారథ్యం..

కిందటి సీజన్ వరకూ ముంబై ఇండియన్స్ జట్టులో ఆల్‌రౌండర్‌గా సత్తా చాటిన హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు కేప్టెన్‌గా ప్రమోట్ అయ్యాడు. గుజరాత్ టైటన్స్‌కు సారథ్యాన్ని వహిస్తోన్నాడు. భుజానికి శస్త్ర చికిత్స వల్ల చాలాకాలం పాటు బౌలింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చిన ఈ మీడియా పేసర్.. ఇక మళ్లీ ట్రాక్‌లో పడనున్నాడు. బౌలింగ్ చేయడం దాదాపుగా ఖాయమైంది. మహ్మద్ షమీ, లోకీ ఫెర్గూసన్, రషీద్ ఖాన్‌, రాహుల్ తెవాతియా, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్‌తో కూడిన బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌కు పాండ్యా దిశానిర్దేశం చేస్తాడు.

కేఎల్ రాహుల్ కేప్టెన్సీలో..

కేఎల్ రాహుల్ కేప్టెన్సీలో..

కేఎల్ రాహుల్ కేప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్.. ఐపీఎల్‌లో అడుగు పెట్టనుంది. క్వింటన్ డికాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, మనన్ వోహ్రా, కృనాల్ పాండ్యా ఈ టీమ్‌లో ఉన్నారు. ఎల్బో గాయం వల్ల మార్క్ వుడ్ దూరం అయ్యాడు. సీజన్ మొత్తానికీ అతను అందుబాటులో ఉండట్లేదు. అతని స్థానాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ టై రీప్లేస్ చేశాడు. ఆల్‌రౌండర్లు మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, కైలే మేయర్స్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది.

మిడిలార్డర్ బలంగా..

మిడిలార్డర్ బలంగా..

రెండు జట్లలోనూ ఓపెనింగ్, మిడిలార్డర్ బలంగా ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌లో కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ ఓపెనింగ్ చేయనున్నారు. మనీష్ పాండే, దీపక్ హుడాతో టాప్ ఆర్డర్‌లో క్రీజ్‌లోకి దిగొచ్చు. కృనాల్ పాండ్యా, అంకిత్ రాజ్‌పుత్ మిడిలార్డర్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. గుజరాత్ టైటన్స్‌లో శుభ్‌మన్ గిల్, మాథ్యు వేడ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

విజయ్ శంకర్ ఏం చేస్తాడో..?

విజయ్ శంకర్ ఏం చేస్తాడో..?

టాప్ ఆర్డర్‌లో వృద్ధిమాన్ సాహా లేదా విజయ్ శంకర్‌ను దింపే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా సత్తా ఉన్న బ్యాటర్లే. వారిలో నిలకడ లోపించడం ఆయా జట్లకు ఇబ్బందికరంగా మారింది. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు చాలాకాలం నుంచీ దూరంగా ఉంటోన్న విజయ్ శంకర్‌ ఏం చేస్తాడనేది ఆసక్తిగా మారింది. 2019 ప్రపంచకప్‌‌లో అరంగేట్రం చేసిన విజయ్.. తొలి బంతిలోనే వికెట్‌ను పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ తరువాత నిలకడ కోల్పోయాడు.

తుదిజట్టులో..

తుదిజట్టులో..

గుజరాత్ టైటన్స్ తుది జట్టులో- శుభ్‌మన్ గిల్, మాథ్యూవేడ్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా/విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, హార్ధిక్ పాండ్యా (కేప్టెన్), రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిశోర్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీకి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌లో- కేఎల్ రాహుల్ (కేప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, దీపక్ హుడా, మనన్ వోహ్రా, కృనాల్ పాండ్యా, అంకిత్ రాజ్‌పుత్, కృష్ణప్ప గౌతమ, రవి బిష్ణోయ్, దుష్మంత చమీరా, అవేష్ ఖాన్ ఆడొచ్చు.

Story first published: Monday, March 28, 2022, 12:08 [IST]
Other articles published on Mar 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+