
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాపై భజ్జీ ప్రశంసలు కురిపించారు. గుజరాత్ టైటాన్స్‌ను కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడని కొనియాడాడు. అలాగే బ్యాటింగ్‌లో రాణించడంతోపాటు బౌలింగ్ కూడా చేయడం గుజరాత్ టైటాన్స్‌కు కలిసొచ్చే అంశంమని చెప్పాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం టీమిండియాకు కూడా శుభపరిణామంగా ఆయన చెప్పాడు. ఐపీఎల్‌లో ఇలాగే రాణిస్తూ, క్రమం తప్పకుండా బౌలింగ్ చేస్తే హార్దిక్ పాండ్యా కచ్చితంగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని తెలిపాడు. ఎందుకంటే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు సరైన ఆల్‌రౌండర్ కావాలని హర్భజన సింగ్ చెప్పాడు.
కాగా ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతుంది. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒకటి కూడా ఓడిపోకుండా అన్నీ గెలిచింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై అంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు సైతం టోర్నీ అసాంతం ఇదే జోరును కనబరిచి టైటిల్ గెలవాలని కోరుకుంటున్నారు.
గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ, జాసన్ రాయ్, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదరంగాని, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, డొమినిక్ డ్రేక్స్, దర్శన్ నల్కండే, యశ్‌రీ జోసెఫ్ దయాల్, ప్రదీప్ జోసెఫ్ దయాల్, , డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, బి సాయి సుదర్శన్