Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పదేళ్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టులో తిలక్ వర్మకు చోటు ఖాయం..!

IPL 2022: Harbhajan, Irfan Pathan says Tilak Varma will play for Mumbai Indians for 10 years

ఐదుసార్లు ఐపీఎల్ విజేత అయిన ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్లో ఎనిమిది ఓటములు, రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఎనిమిది వరుస పరాజయాల తర్వాత రోహిత్ శర్మ సేన వరుసగా రెండు విజయాలు మాత్రమే సాధించింది. ఈ క్రమంలో ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఈ సీజన్లో అప్రదిష్ఠ మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ముంబై ఇక ఎలాగూ ప్లేఆఫ్ చేరేది లేదు.. దీంతో ఎలాగైనా అట్టడుగు స్థానం నుంచి కాస్త ఎగబాకి గౌరవప్రదంగా ఈ సీజన్‌ను ముగించాలని చూస్తోంది.

అయితే ఈ సీజన్లో ముంబై తరఫున ఆడిన ఇద్దరు యువ ప్లేయర్ల ప్రదర్శన మాత్రం పలువురు మాజీ క్రికెటర్లను ఆకట్టుకుంది. మాజీ భారత స్టార్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ ఈ సీజన్‌లో ముంబై జట్టులో అద్భుతమైన ఇద్దరు ప్రతిభావంతులు వెలుగుచూశారని తెలిపారు. తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్‌లు ముంబై జట్టుకు దొరికిన ఆణిముత్యాలని, ఈ యువ ప్లేయర్లు రాబోయే పదేళ్లపాటు ముంబై జెర్సీలో కన్పించే ప్లేయర్లుగా కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ముంబై టీం సరైన పెట్టుబడి

ముంబై టీం సరైన పెట్టుబడి

'ముంబయి ఇండియన్స్‌కు తిలక్ వర్మ, బ్రెవిస్ మంచి పెట్టుబడి. ఈ యువ ప్రతిభావంతులపై ముంబై టీం సరిగ్గానే పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడి ద్వారా ముంబై టీం చాలా సంవత్సరాల పాటు ఫలితాలు పొందుతుంది. బ్రెవిస్, తిలక్ తమ సత్తా ఎంటో ఈ ఐపీఎల్లో చూపించారు. రాబోయే పది సంవత్సరాలు ముంబై జట్టులోనే వాళ్లు ఉండే ఆటగాళ్లు. వారిలో నమ్మశక్యం కాని ప్రతిభను నేను కళ్లారా చూశాను. ఈ యువ ప్లేయర్ల ఆత్మవిశ్వాసం అత్యద్భుతంగా ఉంది' అని స్టార్ స్పోర్ట్స్‌లో హర్భజన్ సింగ్ అన్నాడు.

 ఇలాగే ఆడితే ముంబై జట్టుకు సూపర్ హీరో అవుతాడు

ఇలాగే ఆడితే ముంబై జట్టుకు సూపర్ హీరో అవుతాడు

ఇక ఆడిన 10ఇన్నింగ్స్‌లలో 41సగటుతో 328పరుగులు చేసిన తిలక్ వర్మన్ ఇర్ఫాన్ పఠాన్ బాగా మెచ్చుకున్నాడు. ఈ హైదరాబాదీ ప్లేయర్‌ను ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో ముంబై రూ.1.70కోట్లకు కొనుక్కున్న సంగతి తెలిసిందే. వర్మ గోల్డెన్ ప్లేయర్ అని, అతను ఇలాగే ఆడితే రాబోయే పదేళ్లలో ముంబై జట్టుకు 'సూపర్ హీరో' అవుతాడని ఇర్ఫాన్ జోస్యం చెప్పాడు.

 స్పిన్నర్లను ఎదుర్కోగల సామర్థ్యం తిలక్ సొంతం

స్పిన్నర్లను ఎదుర్కోగల సామర్థ్యం తిలక్ సొంతం

ఇర్ఫాన్ మాట్లాడుతూ.. 'ఓ యంగ్ ప్లేయర్ ఏ జట్టులో బాగా రాణిస్తాడో.. ఆ జట్టు తనదనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఆ జట్టులో తన స్థానాన్ని స్థిరపరుచుకోవడానికి ఓ ఆత్మవిశ్వాసం అతనిలో నాటుకుంటుంది. తిలక్ వర్మ విషయంలో కూడా మనం ఇదే చూస్తున్నాం. అతను ప్రతిభావంతుడైన లెఫ్టార్మ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. అతను సులభంగా స్పిన్ ఆడతాడు, లెగ్ స్పిన్నర్లు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను సహజంగా ఎదుర్కోగల సామర్థ్యం అతని సొంతం. ఈ యువ హీరో రాబోయే పదేళ్లపాటు ముంబై జట్టుకు ఆడతాడు' అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.

Story first published: Monday, May 9, 2022, 21:05 [IST]
Other articles published on May 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+