Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs GT: 100 సిక్సుల క్ల‌బ్‌లోకి హార్దిక్ పాండ్యా.. త‌క్కువ బంతుల్లోనే సాధించిన ఆట‌గాడిగా రికార్డు

IPL 2022: Gujarat Titans captain Hardik Pandya completed 100 sixes in IPL

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో ఓ రికార్డు సాధించాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ ఎయిడెన్ మాక్ర‌మ్‌ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్లో సిక్సు కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 100 సిక్సులు పూర్తి చేసుకున్నాడు. త‌ద్వారా ఐపీఎల్‌లో 100 సిక్సులు కొట్టిన ఆట‌గాడిగా నిలిచాడు.

మూడో స్థానంలో పాండ్యా

ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో త‌క్కువ బంతుల్లో 100 సిక్సులు పూర్తి చేసిన మూడో ఆట‌గాడిగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. 657 బంతుల్లోనే 100 సిక్సులు పూర్తి చేసిన ఆండ్రూ ర‌సెల్ ఐపీఎల్‌లో అత్యంత త‌క్కువ బంతుల్లోనే ఈ ఘ‌న‌త సాధించిన ఆట‌గాడిగా నిలిచాడు. ఇక త‌ర్వాత 943 బంతుల్లో 100 సిక్సులు కొట్టిన క్రిస్ గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. కాగా 1046 బంతుల్లో 100 సిక్సులు పూర్తి చేసిన హార్దిక్ పాండ్యా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. భార‌త ఆట‌గాళ్ల ప‌రంగా మాత్రం త‌క్కువ బంతుల్లో 100 సిక్సులు కొట్టింది హార్దిక్ పాండ్యానే కావ‌డం గ‌మ‌నార్హం.

పాండ్యా రికార్డులు

పాండ్యా రికార్డులు

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 96 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యా 28 స‌గ‌టుతో 1600 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా.. అత్య‌ధిక స్కోర్ 91 ప‌రుగులుగా ఉంది. 151 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టివ‌ర‌కు 100 సిక్సులు, 115 ఫోర్లు బాదాడు.

ప‌వ‌ర్‌ప్లేలో 2 వికెట్లు

ప‌వ‌ర్‌ప్లేలో 2 వికెట్లు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ టైటాన్స్‌కు తొలి ఓవ‌ర్లో భారీగా ప‌రుగులు వచ్చాయి. ఆ ఓవ‌ర్లో భువ‌నేశ్వ‌ర్ వైడ్ల రూపంలో భారీగా ప‌రుగులు ఇచ్చుకోవ‌డంతో ఏకంగా 17 ప‌రుగులు వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాతి నుంచి స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు. మూడో ఓవ‌ర్లో భువ‌నేశ్వ‌ర్, ఆరో ఓవ‌ర్లో న‌ట‌రాజ‌న్ వికెట్లు తీయ‌డంతో గుజ‌రాత్ టైటాన్స్ ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి 2 వికెట్లు కోల్పోయి 51 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత ఉమ్రాన్ మాలికి కూడా వికెట్ తీయ‌డంతో 8 ఓవ‌ర్ల ఆట ముగిసే స‌మ‌యానికి గుజ‌రాత్ 3 వికెట్ల న‌ష్టానికి 64 ప‌రుగులు చేసింది.

104-4

104-4

ఈ క్ర‌మంలో డేవిడ్ మిల్ల‌ర్‌తో క‌లిసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా జ‌ట్టును ఆదుకున్నాడు. వీరిద్ద‌రు నాల్గో వికెట్‌కు 40 ప‌రుగులు జోడించారు. ఈ క్ర‌మంలో 13 ప‌రుగులు చేసిన డేవిడ్ మిల్ల‌ర్ మార్కో జేన్స‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. అప్ప‌టికీ గుజ‌రాత్ స్కోర్ 104 ప‌రుగులుగా ఉంది. ప్ర‌స్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా, అభిన‌వ్ మ‌నోహ‌ర్ ఉన్నాడు.

తుది జట్లు

తుది జట్లు

గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వేడ్(వికెట్ కీప‌ర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్(వికెట్ కీప‌ర్), ఐడెన్ మార్క్‌రామ్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్

Story first published: Monday, April 11, 2022, 23:28 [IST]
Other articles published on Apr 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+