విజయ్ శంకర్ జాతకం తెలిసి ఉంటే కొంచెం తెలపగలరు: ఫెయిల్యూర్స్ మధ్య ఇన్ని ఛాన్సులా

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో అనూహ్యంగా చిత్తయింది. చివరి మూడు ఓవర్లల్లో 48 పరుగులు చేయాల్సిన స్థితిలోకి ప్రత్యర్థిని నెట్టేసినప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోయింది. స్టార్ పేసర్ క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్‌లో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ చేజారిపోయింది. ఆ ఒక్క ఓవర్‌లో 25 పరుగులను పిండుకోవడంతో రన్‌రేట్ భారీగా తగ్గించుకోగలిగారు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు.
170 పరుగుల లక్ష్యంతో..
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ చాలాకాలం తరువాత ఫామ్‌లోకి వచ్చాడు. భారీ ఇన్నింగ్ ఆడాడు. 48 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, శివం దుబే తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, చివర్లో రవీంద్ర జడేజా ధాటిగా ఆడటంతో ఆ స్కోర్ సాధ్యపడింది.
గెలిపించిన మిల్లర్, రషీద్..
చెన్నై సూపర్ కింగ్స్ తరహాలోనే గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్ సాగింది. మాథ్యేవేడ్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా.. తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. గిల్, విజయ్ శంకర్- కనీసం ఖాతాను సైతం తెరవలేకపోయారు. 48 పరుగులకు నాలుగు వికెట్లు కుప్పకూలిన దశలో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ గెలుస్తుందని ఊహించవుండరు. గిల్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. విజయ్ శంకర్‌దీ అదే పరిస్థితి.
గెలిపించిన మిల్లర్-రషీద్
డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ మ్యాచ్‌ను గెలిపించారు. 51 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో డేవిడ్ మిల్లర్ 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రషీద్ ఖాన్ 21 బంతుల్లో 40 పరుగులు బాదాడు. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరూ చెన్నై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. 18వ ఓవర్‌లో రషీద్ ఖాన్ 25 పరుగులను రాబట్టడంతో ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం గుజరాత్ టైటాన్స్ వైపు మొగ్గు చూపింది.
విజయ్ శంకర్‌పై ఎంత నమ్మకమో గానీ..
జట్టు గెలిచిన మాట- విజయ్ శంకర్ డకౌట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. మహీష్ తీక్షణ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే వెనుదిరిగాడు. వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బ్యాటింగ్‌లో కనీసం డబుల్ డిజిట్ కూడా చేయలేకపోతున్న విజయ్ శంకర్‌ను కీలకమైన నంబర్ 3 స్థానంలో పంపించింది మేనేజ్‌మెంట్. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విజయ్ శంకర్ నిలబెట్టుకోలేకపోయాడు. విజయ్ శంకర్ అవుట్ అయ్యే సమయానికి గుజరాత్ స్కోర్ రెండు పరుగులే.
త్రీడీపై ట్రోల్స్
ఐపీఎల్‌లో విజయ్ శంకర్ ఫెయిల్యూర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. చివరి 10 మ్యాచ్‌లల్లో అతను చేసింది 70 పరుగులే. బ్యాటింగ్ యావరేజ్ 8.5. స్ట్రైక్ రేట్ 90.5. ఈ ఫెయిల్యూర్‌తో విజయ్ శంకర్ మరోసారి ట్రోలర్స్ చేతికి దొరికిపోయాడు. సెటైర్ల మీద సెటైర్లు పేలుతున్నాయి అతని మీద. విజయ్ శంకర్‌కు వచ్చిన అవకాశాలు మరొకరికి వచ్చి ఉంటే ఈ పాటికి ప్రపంచంలోనే అపర కుబేరుడిగా మారి ఉంటారంటూ కామెంట్స్ చేస్తోన్నారు. మిస్టరీ మ్యాన్‌గా అభివర్ణిస్తున్నారు. సురేష్ రైనా వంటి ప్లేయర్ అమ్ముడుపోని ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో అతన్ని ఎలా తీసుకున్నారని తలపట్టుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications