బ్యూటీ ఆఫ్ టీ20 క్రికెట్: ఎక్స్‌పీరియన్స్ ఉన్న బౌలర్..ఇలా చేస్తాడనుకోలేదు: రవీంద్ర జడేజా

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని చవి చూసింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో అనూహ్యంగా ఓడింది. అంతా బాగానే ఉందనుకున్న స్థితి నుంచి అథఃపాతాళానికి జారిపోయింది. పాయింట్ల పట్టికలో తొమ్మిది స్థానం నుంచి కదల్లేకపోతోంది. ఆరింట్లో ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆ జట్టు ఖాతాలో ఉన్నవి రెండు పాయింట్లే. తన తదుపరి మ్యాచ్‌ను 21వ తేదీన ఆడనుంది. ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది. అందులో గెలిచినా.. పెద్దగా తేడా ఉండకపోవచ్చు. టోర్నమెంట్‌లో చివరి వరకూ నిలవలేకపోవచ్చు.

మిడిలార్డర్ ఒక్కటే..
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ చాలాకాలం తరువాత ఫామ్‌లోకి వచ్చాడు. భారీ ఇన్నింగ్ ఆడాడు. 48 బంతుల్లో అయిదు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, శివం దుబే తక్కువ పరుగులకే అవుట్ అయినా.. మిడిలార్డర్‌లో అంబటి రాయుడు, చివర్లో రవీంద్ర జడేజా ధాటిగా ఆడటంతో ఆ స్కోర్ సాధ్యపడింది.

మలుపు తిప్పిన 18వ ఓవర్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పరుగుల వరద పారించిన రాబిన్ ఉతప్ప, శివం దుబే తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివరి 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన స్థితిలోకి గుజరాత్‌ను తీసుకొచ్చినప్పటికీ మ్యాచ్‌ను చెన్నై కోల్పోయింది. దీని ప్రధాన కారకుడు స్టార్ పేసర్ క్రిస్ జోర్డాన్. అతను వేసిన 18వ ఓవర్- మ్యాచ్‌ను చెన్నై చేతుల్లో నుంచి జారిపోయేలా చేసింది. ఆ ఒక్క ఓవర్‌లో 25 పరుగులను పిండుకున్నారు.

రషీద్ ఖాన్ భారీ షాట్స్..
ఈ ఓవర్‌ను ఎదుర్కొన్న రషీద్ ఖాన్- 6,6,4,6తో చెలరేగాడు. ఈ ఓవర్ ముగిసేసరికి ఈక్వేషన్స్ 12 బంతుల్లో 25 పరుగులుగా మారింది. ఆ తరువాతి ఓవర్‌లో రషీద్ ఖాన్ అవుటైనప్పటికీ.. మరో ఎండ్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్ మ్యాచ్‌ను గెలిపించాడు. కీలకమైన 18వ ఓవర్‌ను క్రిస్ జోర్డాన్ చేతికి ఇవ్వడాన్ని కేప్టెన్ రవీంద్ర జడేజా సమర్థించుకున్నాడు. తమ అంచనాలు ఇదివరకెప్పుడూ తప్పలేదని వ్యాఖ్యానించాడు.

డెత్ ఓవర్లల్లో..
ఓవర్‌లో నాలుగైదు యార్కర్లను సంధించే సత్తా అతనికి ఉందని, ఈ మ్యాచ్‌లో అది వాస్తవ రూపం దాల్చలేదని చెప్పాడు. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం జోర్డాన్‌కు ఉందని, ఒత్తిడిని తేలిగ్గా ఎదుర్కొనగలడని చెప్పుకొచ్చాడు. తాము ముందుగా వేసుకున్న ప్రణాళికలను చివరి అయిదు ఓవర్లలో పక్కాగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయామని పేర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించిన ఘనత డేవిడ్ మిల్లర్‌కు దక్కుతుందని అన్నాడు.కొన్ని అద్భుతమైన క్రికెటింగ్ షాట్స్ ఆడాడని చెప్పాడు.

తొలి ఆరు ఓవర్లల్లో..
బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించుకున్నామని, డెత్ ఓవర్లలో ప్లాన్ పక్కాగా అమలు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అన్నాడు. తొలి ఆరు ఓవర్ల పాటు తమ బౌలింగ్ యూనిట్.. ప్లాన్‌కు తగ్గట్టే పని చేసిందని పేర్కొన్నాడు. బౌలర్లపై ఒత్తిడిని తీసుకుని రావడంలో డేవిడ్ మిల్లర్ సక్సెస్ అయ్యాడని వివరించాడు. ఆ ఒత్తిడిని తమ బౌలర్లు జయించలేకపోయారని పేర్కొన్నాడు. చేతికి అందిన మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చిందని, దట్స్ ద బ్యూటీ ఆఫ్ టీ20 క్రికెట్ అని వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications