
అతను మా జట్టులో ఉండడం లక్కీ
ఈ మ్యాచ్ అనంతరం వర్చువల్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కిర్ స్టన్ మాట్లాడుతూ.. 'నేను స్పష్టంగా చెప్పదల్చుకుందేంటంటే సాహా మా టీంలో ఉండడం మాకు లక్కీ. అతను చాలా ఆకట్టుకున్నాడు. అతనో పర్ ఫెక్ట్ ప్రొఫెషనల్ ప్లేయర్. అతను ఐపీఎల్‌తో సహా క్రికెట్లోని ఇతర ఫార్మాట్లలో మంచి అనుభవాన్ని గడించాడు. అది అతనికి ప్లస్ అవుతుంది' అని కిర్‌స్టన్ పేర్కొన్నాడు.

అవసరానికి తగ్గట్లు ఆడే ప్లేయర్
టీ20 ఫార్మాట్లో పవర్ హిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఆటగాళ్లలో సాహా ఒకడు. సాహా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తన పవర్ హిట్టింగ్ కెపాబిలిటీని చూపించాడు. ఫలితంగా పవర్ ప్లేలో గుజరాత్‌కు 53 పరుగులొచ్చాయి. కిర్‌స్టన్ మాట్లాడుతూ.. 'అతను తన ఆటను అర్థం చేసుకున్నాడు. పవర్ ప్లేలో బాగా ఆడగలడు. అవసరమైన టైంలో అవసరానికి తగ్గట్లు ఆడడంలో నేర్పరి. జట్టుకు ఒక ఆస్తి లాంటోడు. అవసరమున్న టైంలో తను నిజంగా చాలా బాగా ఆడి నిన్నటి మ్యాచ్ గెలిపించాడు' అని తెలిపాడు.

ఏ టైంలో ఎలా బ్యాటింగ్ చేయాలో సాహాకు తెలుసు
'ఇకపోతే ఇలా ఆడు అలా ఆడు అంటూ మనం సాహాకు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అతనికి పవర్-ప్లేలో ఎలా ఆడాలో బాగా తెలుసు. ఆ తర్వాత ఏ టైంలో ఏ రకమైన బ్యాటింగ్ చేయాలో కూడా తెలుసు. అతను గేమ్‌ను బాగా అర్థం చేసుకుంటాడు. షార్ట్ బాల్స్ ను ఎదుర్కోవడంలో అతని స్కిల్ చాలా బాగుంటుంది.' అని కిర్‌స్టన్ పేర్కొన్నాడు.

చివరి వరకు క్రీజులో పాతుకుపోయాడు
ఇక నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (53పరుగులు 49బంతుల్లో 4ఫోర్లు 1సిక్స్), ఎం జగదీషన్ (39పరుగులు 33బంతుల్లో 3ఫోర్లు 1సిక్స్) రాణించడంతో నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133పరుగులు చేసింది. ఇక 134పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌కు ఖతర్నాక్ శుభారంభం దక్కింది.
ఓపెనర్లు డబ్ల్యూ.సాహా, శుభ్‌మాన్ గిల్ కలిసి 59పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మధ్యలో కాస్త టఫ్ వచ్చినా మిల్లర్(15పరుగులు 20బంతుల్లో నాటౌట్)తో కలిసి సాహా (67పరుగులు 57 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్ నాటౌట్) ఆచితూచి ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు.