
ఐపీఎల్ 2022లో వరుస ఓటములు ముంబై ఇండియన్స్ టీంను కలవరపెడుతున్నాయి. శనివారం లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓడిపోయింది. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని ముంబై వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడింది. అదేం చిత్రమో కానీ 5 సార్లు టైటిల్ విన్నర్ అయినా ముంబై ఇండియన్స్ ఎంత కష్టపడినా విజయం దక్కడం లేదు. దీంతో ముంబై ఇండియన్స్ టీం మొత్తం తీవ్ర నిరాశలో ఉంది. ఇక ఆ జట్టులోని ఆటగాళ్లైతే ప్రస్టేషన్ ఫీలవుతున్నారు.
లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ప్రస్టేషన్ స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో 200 పరుగుల భారీ లక్ష్యంతో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగింది. అయితే ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను తన భుజాలపై వేసుకోని నడిపించే ప్రయత్నం చేశాడు. ఆరో ఓవర్లో క్రీజులో కుదురుకున్న డెవాల్డ్ బ్రెవిస్ ఔటయ్యాడు. ఆ వెంటనే ఏడో ఓవర్లో స్టోయినీస్ వేసిన అద్భుత బంతికి ఇషాన్ కిషన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 17 బంతులు ఎదుర్కొన్న కిషన్ 2 ఫోర్లతో 13 పరుగులకే ఔటయ్యాడు. అయితే మైదానాన్ని వీడే సమయంలో ఔటైయ్యాననే ప్రస్టేషన్‌లో ఇషాన్ కిషన్ బ్యాట్‌ను బౌండరీ లైన్‌కు బలంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వారా వరుసగా 6 మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్(103) అజేయ సెంచరీతో చెలరేగాడు. మనీష్ పాండే కూడా 38 పరుగులతో రాణించాడు. అనంతరం 200 పరుగుల లక్ష్య చేధనలో ముంబై 181 పరుగులకే పరిమితమైంది. సూర్యకుమార్ యాదవ్ (37), డెవాల్డ్ బ్రెవిస్ (31), తిలక్ వర్మ(26), కీరన్ పొలార్డు(25) మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 6 పరుగులకే ఔటయ్యాడు.